సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. `లవ్ సోనియా` అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తనదైన టాలెంట్ తో బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకున్న మృణాల్.. `సీతారామం` సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
ఆగస్టు 5న తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ ప్రేమ కావ్యం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో సీతామహాలక్ష్మి గా ప్రేక్షకులను కట్టిపడేసిన మృణాల్ కు ప్రస్తుతం సౌత్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తన తొలి సినిమా `లవ్ సోనియా` రోజులను గుర్తుచేసుకుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఎంతో కష్టపడిందట.
లవ్ సోనియా సినిమాలో అక్రమ రవాణాకు గురైన చెల్లిని రక్షించుకునే అక్క పాత్రను మృణాల్ పోషించింది.. దానికోసం ఆమె వేశ్యక మారాల్సి ఉంటుంది. అయితే పాత్ర సహజంగా ఉండాలని కోల్‌కతాలోని వేరుశ గృహంలో మృణాల్ రెండు వారాలు ఉందట. అక్కడ వాళ్లతో గడిపి వాళ్ల కథలు వింటున్నప్పుడు ఆమె గుండె చలించిపోయేదట.
ఆ తర్వాత కూడా మృణాల్‌కు వాళ్లే గుర్తొచ్చేవారట. వాళ్ల బాధలను గుర్తు చేసుకుంటూ డ్రిపెషన్లోకి కూడా వెళ్లిపోయిందట. అయితే దర్శకుడు ఇచ్చి కౌన్సిలింగ్‌తోనే డిప్రెషన్ నుంచి బయటపడి.. లవ్ సోనియాలో నటించానని మృణాల్ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే.. ఈ సినిమాలో మృణాల్ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అలాగే మరెన్నో ఆఫర్లను సైతం వచ్చాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!