NewsOrbit
Entertainment News సినిమా

చై-సామ్ విడాకులు.. మా పనిమనిషి చెబితేనే తెలిసింది: మురళీ మోహన్

Advertisements
Share

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు కొద్ది నెల‌ల క్రితం విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 2010లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ `ఏ మాయ చేశావే` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీసింది. ఈ నేప‌థ్యంలోనే ఇరు కుటుంబ‌స‌బ్యుల‌ను ఒప్పించి.. గోవా వేదిక‌గా 2017లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

Advertisements

పెళ్లి త‌ర్వాత చై, సామ్‌లు స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొన‌సాగించారు. ఇద్ద‌రూ క‌లిసి సినిమాలు, యాడ్స్‌లో కూడా న‌టించారు. వీరిద్ద‌రి అన్యోన్య‌త‌ను చూసి అక్కినేని అభిమానులు మురిసిపోయారు. కానీ, ఏం లాభాం.. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క‌ముందే విడాకుల వైపు ట‌ర్న్ తీసుకుని.. అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు.

Advertisements

కానీ, చై-సామ్‌లు మాత్రం ఎవ‌రి లైఫ్‌లో వారు బిజీగా మారారు. అయితే తాజాగా చై-సామ్ విడాకులపై సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నేత మురళీ మోహన్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ.. `నాగార్జున గారు అడ‌గ‌టంతో మా అబ్బాయి కోసం నిర్మించిన అపార్ట్మెంట్ ను నాగ చైతన్య కి ఇచ్చాను. నాగ చైతన్య, సమంతలు మా అపార్ట్మెంట్ లో ఉండేవారు.

వారిద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఉదయాన్నే లేచి జిమ్ చేసేవారు. చాలా బాగా కలిసుండే వారు. అలాంటి వాళ్ళు విడిపోతున్నారు అని మా పనిమనిషి వచ్చి చెబితేనే తెలిసింది. వారిద్ద‌రూ ఎందుకు అనేది నాకు తెలీదు. నాకు ముందుగా తెలిసుంటే కనుక నాగార్జున గారితో మాట్లాడి ఏదో ఒకటి చేసేవాడిని. కానీ, మనం అనుకున్నవన్నీ జరగవు కదా` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త వైర‌ల్‌గా మారాయి.


Share
Advertisements

Related posts

Penny Song: కళావతి తరహాలోనే సర్కారు వారి పాట రెండో సాంగ్ రికార్డ్..!!

sekhar

Samantha: ఆ సీన్స్‌లో అదరగొట్టింది..సినిమాలో అవే స్పెషల్..!

GRK

Aishwarya Rai Bachchan: బిగ్ బి కుటుంబం లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం లేనిది ఎవరికో తెలుసా??

Naina