మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌తారా? అన్న ప‌శ్న‌కు చైతు క్రేజీ ఆన్స‌ర్‌!

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య గ‌తం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత‌ను ప్రేమించిన చైతు.. పెద్ద‌ల అంగీకారంతో 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా సామ్‌, చైతూల పెళ్లి జ‌రిగింది. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరిద్ద‌రూ విడిపోయి అంద‌రికీ షాక్ ఇచ్చారు. విడాకుల అనంత‌రం చైతు, సామ్‌లు కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి.. వ‌రుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నారు. ఇటీవ‌లె చైతు `థ్యాంక్యూ` మూవీతో వ‌చ్చాడు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే ఇప్పుడీయ‌న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఆమీర్ ఖాన్ హీరోగా, యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్దా`. అద్వైత్‌ చందన్ డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న హిందీ, తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో నాగచైతన్య తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ ఇంట‌ర్వ్యూలో `మ‌ళ్లీ మీరు ప్రేమ‌లో ప‌డ‌తారు..? అందుకు సిద్ధంగా ఉన్నారా?` అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. అందుకు చైతు `ఏమో! ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు` అంటూ క్రేజీ ఆన్స‌ర్ ఇచ్చాడు. అంతేకాదు, ‘ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ప్రేమించాలి. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యవంతంగా.. సానూకూలంగా సాగుతుంది` అని చెప్పుకొచ్చాడు. దాంతో చైతు కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

41 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago