యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు.
ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు.. `థ్యాంక్యూ`తో పాటు తన అప్ కమ్మింగ్ ప్రాజెక్ట్స్ గురించి సైతం మాట్లాడాడు.
`థ్యాంక్యూ`లో ఆ ట్విస్ట్ సినిమాకే హైలెట్ అంటున్న చైతు!
ఈ నేపథ్యంలోనే వెంకట్ ప్రభు సినిమాపై కూడా స్పందించాడు. `మానాడు` ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఈ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం..త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.
అయితే ఈ చిత్రంలో తాను పోలీస్ పాత్రలో కనిపిస్తానని, ఇది బైలింగ్వల్‌గా చేస్తున్నట్టు తాజా ఇంటర్వ్యూలో చైతు తెలిపారు. అంతేకాదు, ఆగస్ట్ నెల నుండీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా ఆయన వెల్లడించారు. కాగా, గతంలో నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇప్పుడు మరోసారి చైతు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నానని చెప్పాడు. దీంతో ఎక్కడ `సాహసం శ్వాసగా సాగిపో` సెంటిమెంట్ రిపీట్ అవుతుందో అని ఫ్యాన్స్ కాస్త కలవర పడుతున్నారు.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…