యవసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొంత కాలం నుండీ వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన నుంచి చివరిగా వచ్చిన మజిలీ, వెంకీ మామ, లవ్ స్టొరీ మరియు బంగార్రాజు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈయన మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేందుకు `థ్యాంక్యూ`తో వస్తున్నాడు.
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ జూలై 22న అట్టహాసంగా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చైతు ఒక్కో సినిమాకు అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఈయన ఒక్కో సినిమాకు రూ. 6 నుండి 8 కోట్ల వరకు పారితోషికం అందుకునేవారు అన్న టాక్ ఉంది.
అయితే లవ్ స్టొరీ, బంగార్రాజు హిట్ల తర్వాత చైతు తన రెమ్యునరేషన్ ను పెంచేశాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈయన రూ. 10 నుండి 12 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. `థ్యాంక్యూ` మూవీకి సైతం చైతు రూ. 10 కోట్లకు పైగానే చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!