Entertainment News సినిమా

ఆ హీరోయిన్‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోను: నాగ చైత‌న్య‌

Share

నాగ చైత‌న్య‌ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయ‌న‌.. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఆమెతో విడిపోయారు. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. రీసెంట్ గా `లాల్ సింగ్ చద్దా`తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీలో చైతు ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. అద్వైత్ చందన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైంది. కానీ, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫలం అయింది. అయితే ఈ మూవీని ప్ర‌మోట్ చేయ‌డం కోసం అమీర్ ఖాన్‌తో క‌లిసి చైతు వ‌రుస ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా చైతు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకుని వార్త‌ల్లో నిలిచాడు. ఇక రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చైతూకు.. `ఫ్యూచ‌ర్‌లో బాలీవుడ్ లో హీరోగా చేస్తే ఏ హీరోయిన్స్‌తో కలిసి నటించాలని ఉంది..?` అనే ప్రశ్న ఎదురైంది. అందు ఆయ‌న బ‌దులిస్తూ.. `ఆలియా భట్‌, కత్రీనా కైఫ్‌, ప్రియాంక చోప్రాల ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు.

వారందరితో కలిసి పని చేయాలని ఉంది. అయితే ముఖ్యంగా ఆలియా భట్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్‌ హర్‌ యాక్టింగ్‌. ఒకవేళ ఆమెతో నటించే అవకాశం వస్తే అస్స‌లు వదులుకోను` అంటూ చెప్పుకొచ్చారు. ఇక త‌న‌ సెలబ్రెటీ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని కూడా చైతు స్ప‌ష్టం చేశాడు. దీంతో ఇప్పుడీయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 


Share

Related posts

Mahesh Babu-Keerthi Suresh: కీర్తి సురేష్‌తో మ‌హేష్ రొమాంటిక్ స్టిల్‌.. న‌మ్ర‌త చూస్తే ఏమ‌వుతుందో?

kavya N

సర్కారు వారి పాట లో హాలీవుడ్ రేంజ్ విలన్.. దీంతో అసలు విషయం బయట పడింది ..?

GRK

Nagarjuna : అమ్మో నాగార్జున మామూలోడు కాదు – చిరు, బాలయ్యల కే చెమటలు పట్టిస్తున్నాడు

arun kanna