Naga Chaitanya Shobitha: 2021లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరికి వారు తమ కెరియర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రేమించి పెద్దలను ఒప్పించి.. జరిగిన ఈ పెళ్లి నాలుగు సంవత్సరాల లోనే పేటాకులు అయింది. ఏ కారణంగా విడిపోయారు అన్నదాని గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో వార్తలు వల్ల తమ ఇద్దరి మధ్య మూడో పర్సన్ గురించి రాసిన రాతల వల్ల.. విడిపోయినట్లు కష్టిడి ప్రమోషన్ కార్యక్రమంలో నాగచైతన్య స్పష్టం చేశారు.

అసలు సంబంధం లేని వ్యక్తి గురించి జరిగిన ప్రచారం వలన ఇద్దరం విడిపోయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ప్రస్తుతం శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ ఇద్దరూ విదేశాలలో చట్టపట్టలేసుకొని కూడా తిరుగుతున్న కొన్ని ఫోటోలు బయటపడ్డాయి.

ఓ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే నాగచైతన్య… శోభిత దూళిపాళ్ల నీ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఓ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఆర్టికల్ ప్రచురించింది. ఇంటికి పెద్ద కొడుకు నేపథ్యంలో పెళ్లి జీవితం పెటాకులు కావడంతో మొదట ఇండస్ట్రీకి సంబంధం లేనిది అమ్మాయితో పెళ్లి చేయాలని నాగార్జున భావించారట.

ఈ క్రమంలో వెతుకులాటలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో చైతుకి ఇచ్చి పెళ్లి చేయడానికి.. ప్రయత్నాలు కూడా చేయడం జరిగిందట. కానీ శోభితతో రిలేషన్ లో ఉండటంతో ఈ విషయం నాగార్జునకి అర్థమయ్యే రీతిలో వివరణ ఇవ్వటంతో… గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే ఈ ప్రేమ జంట అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే .. అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య రెండో పెళ్లి వార్త అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి