Naga Panchami Serial ఏప్రిల్ 24: పాము కాటుతో అవస్థలో ఉన్న పంచమిని చేతులమీద ఎత్తుకుని తీసుకెళ్తుంటాడు మోక్ష…ఇలా నాగ పంచమి ఏప్రిల్ 24 నేటి ఎపిసోడ్ S1 E25 మొదలవుతుంది. క్రితం ఎపిసోడ్ లో నంబూద్రి ని పాము విషం నుండి కాపాడే ప్రయత్నం లో తన ప్రాణాలకే ముప్పు తెచుకుంది పంచమి. ఒంట్లో విషం ఎక్కిన పంచమిని పట్టుకుని పరుగెడుతుంటాడు మోక్ష.

Naga Panchami Serial ఏప్రిల్ 24: నన్ను కిందకు దించండి బాబు గారు
మోక్ష తనని ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఇబ్బంది పడుతుంది పంచమి. బాబు గారు మీరు నన్ను ఇలా ఎత్తుకొని తీసుకువెళ్లడం ఎవరైనా చూస్తే బాగోదు బాబు గారు నన్ను కిందకు దించండి అంటుంది మోక్ష. నా మాట వినండి బాబు గారు, నేను నడవగలను అని చెప్తున్నాను కదా అంటున్న పంచమి ని మాట్లాడటం ఆపమని అంటాడు మోక్ష. నువ్వు నడవటం వలన రక్త ప్రసరణ పెరిగి విషం ఒళ్ళు అంతా పాకుతుంది అని మోక్ష మందలిస్తాడు.
పంచమి నీ ఒంట్లో విషం ఉంది…నువ్వు త్వరలో చనిపోతావు
అలా పంచమిని మోక్ష ఎత్తుకుని తీసుకువెళ్తుండగా పంచమికి ఏవో మాటలు వినపడ్తాయి. అవి నాగ లోకం నుండి నాగ కన్యల మాటలు. పంచమికి విషం ఒళ్ళంతా పాకుంతుంది అని ఆ నాగ కన్యలు ఎవరికీ వినపడకుండా కేవలం పంచమికి మాత్రమే వినపడేట్టు హెచ్చరిస్తాయ్. నువ్వు తగిన కాలకూట విషం నిన్ను దహించివేస్తుంది నువ్వు చనిపోతావ్ అని నాగ కన్యలు భయం కలిగేలా అంటారు… ఇవి మోక్షకు వినపడవు ఎం జరుగుతుందో అర్ధం కాక దిక్కులు చూస్తాడు మోక్ష . ఆ మాటలు విన్న పంచమికి ఒకేసారి కడుపులో మంట రావటం మదలవుతింది…తనకు ఏమవుతుందో అని కంగారు భయం లో ఉన్న పంచమిని మనం చూస్తాము.

Naga Panchami Serial ఏప్రిల్ 24: సాంబయ్య గా నాగేశ్వరి ఎంట్రీ
ఇదంతా జరుగుతూ ఉండగా పంచమి విషం మింగింది అన్న విషయం సాంబయ్యకు తెలుస్తుంది. పంచమి నాగ కన్య తనకి ఎం కాదు అని మనసులో అనుకుంటాడు కానీ కంగారు ఆపుకోలేక పంచమి ఎక్కడుంది అని పరుగులు తీస్తాడు. మోక్ష పంచమిని వెనుకనుండి ఒక నాగు పాము ఫాలో చేస్తూ వుంటుంది. అయితే ఆ నాగు పాము ఎవరో కాదు నాగేశ్వరి. తన పాము రూపం మర్చి పంచమిని కాపాడటానికి సాంబయ్య లా మారిపోతుంది నాగేశ్వరి.

నా కూతురిని కిందకు దించు
సాంబయ్య మారిన నాగేశ్వరి మోక్ష ను ఆపి పంచమిని కిందకు దించమని అడుగుతాడు. నా బిడ్డకు నువ్వు చేసిన సహాయం చాలు కిందకు దించు, నిన్ను కాపాడటానికే నా కూతురికి ఈ గతి పట్టింది అంటాడు. ఇవ్వన్నీ మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు నా కార్ పక్కనే ఉంది తనను హాస్పిటల్కి తీసుకువెళదాం అంటాడు మోక్ష. మోక్ష మాటలు వినకుండా నా కూతురిని నేను కాపాడుకోగలను కిందకు దించు అంటాడు సాంబయ్య. నొప్పితో ఉన్న పంచమి సాంబయ్యను మోక్ష మీద కోపడవోద్దు అతను నన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటుంది. ఇది విన్న సాంబయ్య రూపంలో ఉన్న నాగేశ్వరి కోపం తో నీ తండ్రి కన్నా పరాయివాడు ఎక్కువైపోయాడా అని అంటుంది.
పంచమిని కిందకు దించి మోక్ష వెళ్ళిపోతాడు. సాంబయ్య రూపం లో ఉన్న నాగేశ్వరి పంచమి నుదుటి మీద తన బొటన వేలు పెట్టి విషం లాగేస్తుంది. మొత్తం విషం తీసేసిన అనుమానం రాకుండా చేస్తుంది నాగేశ్వరి. ఇంతలో అక్కడికి నిజమైన సాంబయ్య రావటం చూసి మళ్లీ పాములా మారిపోయి అక్కడ్నుంచి నాగేశ్వరి వెళ్ళిపోతుంది.

ఎంత దారుణం ఇది పంచమి
సాంబయ్య అక్కడికి వొచ్చేసరికి పంచమి ఒక్కతే కింద పడుకుని ఉంటుంది. ఎవరు లేకపోవడం చూసి మోక్ష పంచమిని అక్కడ వొదిలేసి వెళ్ళిపోయాడు అని అపార్ధం చేసుకుంటాడు సాంబయ్య. ఎంత దారుణం అమ్మ ఇది నువ్వు వాళ్ళ ప్రాణం కాపాడటానికి కష్టపడుతుంటే నీ ప్రాణం లెక్క చేయకుండ నిన్ను ఇక్కడ వొదిలేసి వెళ్ళిపోయాడు ఆ పట్నం బాబు అనుకుంటూ ఏడుస్తాడు.. నువ్వు ఆ శివయ్య ప్రసాదం తల్లి నీకు ఏమి కాదు అంటూ పంచమిని లేపే ప్రయత్నం చేస్తాడు సాంబయ్య.

కొంచం సేపటి తరువాత కళ్ళు తెరిచి పైకి లేస్తుంది పంచమి. మోక్ష గురించి అడుగుతూ జరిగిందంతా సాంబయ్యకు వివరిస్తుంది పంచమి. ఇది విన్న సాంబయ్య ఆశ్చర్యంతో నేను అసలు ఇక్కడకు ఇప్పుడే వొచ్చాను తల్లి ఆ శివయ్య ఇందాక నా రూపంలో వొచ్చి నిన్ను కపడిఉంటాడు అని అంటాడు సాంబయ్య. నాగ పంచమి రేపటి ఎపిసోడ్ లో తిరిగి ఇంటికి వెళ్తుండగా నాగు పాముల వలయంలో చిక్కుకున్న మోక్ష ని చూపిస్తారు… మరి రేపు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
Nuvvu nenu prema: కృష్ణ చెంప పగలగొట్టిన అండాలు..అరవిందకు పద్మావతి నిజం చెబుతుందా..?