Naga Panchami Serial Today Episode ఏప్రిల్ 27: మోక్ష మేన మామ భూపతి కంగారుగా పరిగెడుతూ ఇంటికి వొస్తాడు అక్కడే నంబూదరి కూర్చుని ఉంటాడు. ఆయాసంతో ఉన్న అతనికి కూతురు మంచినీరు ఇస్తుంది. ఇలా ఈరోజు నాగపంచమి సీరియల్ ఏప్రిల్ 27 2023 ఎపిసోడ్ 27 మొదలవుతుంది. తన ఆయాసం తీర్చుకున్న తరువాత జరిగింది చెప్పటం మొదలుపెడతాడు.

సాంబయ్య పంచమిని హాస్పత్రికి తీసుకువెళ్ళలేదు ఆ పరమశివుడే సాంబయ్య రూపంలో వొచ్చి పంచమి ప్రాణాలు పోకుండా కాపాడాడు అని భూపతి తన భార్య వంక చూస్తూ చెప్తాడు. ఇది విన్న నంబూదరి భూపతి అసలు ఎమ్ జరిగిందో వివరముగా చెప్పు అని అంటాడు. భూపతి జరిగిందంతా స్వామీజీకి చెప్పేస్తాడు. ఇది కళా నిజామా అని నాకు ఇప్పటికి నమ్మబుద్ది కావట్లేదు అని అంటాడు. స్వామిజీ మొఖం మాత్రం అనుమానం తో మారిపోతుంది. పంచమి ఆ శివయ్యని నమ్ముకుంది కాబట్టే తనకి ఎమ్ కాకుండా కాపాడుకున్నాడు అని అంటుంది భూపతి భార్య భానుమతి.
దైవానుగ్రహం పొందిన పంచమి
భూపతి చెప్పిన మాటలు విన్న తరువాత గురూజీ ఆనందిస్తాడు, దైవానుగ్రహం పొందిన పంచమి మన ఊరిలో ఉండటం మన అదృష్టం అని భూపతి భార్య భానుమతి అంటుంది. అయితే పక్కనే ఉన్న మోక్ష తల్లి వైదేహి మాత్రం ఇది అదృష్టం కాదు అరిష్టం అని అంటుంది…అలా అంటావు ఏంటి వదినా అని భానుమతి నివ్వెరబోతుంది.
లేకపోతే ఏంటి ఈ ఊరిలో ఎక్కడ చూసిన పాములు… ఎప్పుడు ఎవరిని కాటువేస్తాయో తెలియదు ప్రాణాలు చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతకాలి. దీన్ని అరిష్టం అంటారా దురదృష్టం అంటారా? అందుకే ఇక్కడనుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, పదండి గురూజీ మనం ఇక్కడినుంచి వెళ్ళిపోదాం అంటుంది వైదేహి.

సర్పగండం ఉన్న నా కొడుకు పరిస్థితి ఏమిటి?
దైవానుగ్రహం ఉన్న మీకే ప్రాణాపాయం వొచ్చింది అంటే సర్పగండం ఉన్న నా కొడుకు పరిస్థిథి ఏంటి అన్నది ఆలోచించండి మనం వెళ్ళిపోదాం అని నంబూదరి తో మోక్ష తల్లి వైదేహి అంటుంది. మోక్ష రూమ్ తలుపులు తీసి మోక్షఅని పిలుస్తుంది. లోపలి వెళ్లి చూస్తే మోక్ష కనిపించడు…కంగారుగా వదినా అని పిలుస్తూ మోక్ష కనిపించడం లేదు అని చెప్తుంది. కనిపించక పోవడం ఏమిటి ఇప్పుడే కదా మోక్ష అటు వెళ్ళాడు అని అందరు కంగారుపడతారు.
వాళ్ళు ఈ ఊరు వొదిలి వెళ్ళటానికి వీలులేదు…నాగేశ్వరి
తరువాత సీన్ లో నాగేశ్వరి కనపడుతుంది… ఆ నంబూదరి మోక్షాలు ఊరు వదిలి వెళ్ళటానికి సిద్ధం అవుతున్నారు. వాళ్ళు మన శత్రువులా కాదా అని తెలుసుకునేంతవరకు వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళటానికి వీల్లేదు అని నాగేశ్వరి పక్కన ఉన్న నాగకన్యలకు చెప్తుంది. ఒకవేళ వాళ్ళు మన శత్రువులే అయితే వెళ్లిపోయిన వారిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అప్పుడు నేను నాగరానికి ఇచ్చిన మాట పోగొట్టుకున్నట్టు అవుతుంది అంతే వారి మీద పాగ తీర్చుకునే అవకాశం పంచమి కోల్పోతుంది అని అంటుంది నాగేశ్వరి.

పంచమికి పగ ప్రతీకారాలు అన్ని గుర్తు వస్తాయి
పంచమి ఇంకా మనిషి రూపంలోనే ఉంది కాబట్టి మనం చెప్పేది ఏది తనకు అర్ధం కావట్లేదు. ఒక్కసారి పాము రూపంలోకి మారి మన జాతిలో కలిసిన తరువాత తనకి పగ ప్రతీకారం అన్ని గుర్తువస్తాయి అని నాగ కన్యలకు చెపుతుంది నాగేశ్వరి. అది జరిగే వరకు వాళ్లలో ఏ ఒక్కరు ఈ ఉరి పొలిమేర దాటడానికి వీల్లేదు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటుంది నాగేశ్వరి. నీ అంతట నీవు నీ జన్మరహస్యం తెలుసుకున్న రోజే నీ పగను సాధించగలవు త్వరగా నీ జన్మరహస్యం తెలుసుకోవటానికి ప్రయత్నించు పంచమి అని మనసులో అనుకుని అక్కడ నుండి మాయం అయిపోతుంది.

పూర్తిగా నాగు పాములా మారిపోయిన పంచమి
అక్కడ ఇంట్లో కనపడకుండా పోయిన మోక్ష పంచమి ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. పంచమికి ఎలా ఉందొ తెలుస్కుందాం అని అక్కడికి వెళ్తాడు. కాసేపు వారిద్దరి మధ్య సరదా మాటలు చోటుచేసుకుంటాయి. కొంచెం సేపటి తరువాత మోక్షని వెతుకుంటూ అక్కడికి తల్లి వైదేహి ఇంకా స్వామీజీ వస్తారు. ఈ ఊరు నుంచి మనం వెళ్ళిపోదాం అని మోక్షాన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని బయల్దేరుతారు. ఉరి పొలిమేర దెగ్గర ఒకేసారి నాగు పాములు దాడి చేసి వారిని ఊరు ధాటి వెళ్లకుండా ఆపేస్తాయి. మరోవైపు ఇంట్లో పడుకుని ఉన్న పంచమి చర్మం మెల్లగా పాము చర్మం లా మారిపోతుంది. అది చూసిన సాంబయ్య భయం తో పంచమి దెగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు కానీ ఈలోపే పంచమి పూర్తిగా నాగు పాములా మారిపోతుంది.