Naga Panchami Serial మే 10: వైదేహి కి ఫోన్ రావడం తో నాగ పంచమి నేటి ఎపిసోడ్ మే 10 E39 ప్రారంభం అవుతుంది. ఫోన్ లో తన భర్త వైదేహి తో నాకు మోక్ష విషయం లో భయంగా ఉంది నువ్వే ఎలా అయినా వెళ్లి మోక్షను ఒప్పించి మన ఇంటికి కోడలిగా తీసుకురావాలి. మనం పాములనుండి మోక్షను రక్షించుకోవాలి అంటే ఇదే మంచి పని అని అంటాడు. ఆ అమ్మాయి తో పెళ్లి అంటే నీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు కానీ మన అవసరం వైదేహి అవసరమైతే పంచమి తల్లి తండ్రుల కాళ్ళు పట్టుకునైనా పంచమి తో మోక్ష పెళ్లికి ఒప్పించు.

మన ఇంట్లో పనిమనిషి కి కూడా పనికిరాదు ఆ పంచమి
తన భర్త మాటలు విన్న వైదేహి కోపం తో మీరు ఎమ్ మాట్లుడుతున్నారు అని అడుగుతుంది. మన ఇంట్లో పనిమనిషికి కూడా పనికిరాని ఆ పంచమిని నా కోడలిగా చేసుకోవాలా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి అని చెప్తుంది. నీకు అర్ధం కావట్లేదు వైదేహి ఇది మన గురించి కాదు మోక్ష ప్రాణాలకు సంబందించిన సమస్య ఎమ్ చేసైనా మనం మోక్ష ప్రాణాలు కాపాడుకోవాలి. అవసరం అయితే అడిగినంత డబ్బు ఇచ్చి పంచమిని మన ఇంటికి పనిమనిషిగా తీసుకువొస్తాను అని చెప్పేస్తుంది వైదేహి. ఆ తరువాత మోక్షను తీసుకుని గుడి దెగ్గరకు వెళ్తుంది వైదేహి.

Naga Panchami Serial మే 10: పెళ్లి కూతురైన పంచమి
తరువాత సీన్ లో పంచమిని పెళ్లికూతురు గా రెడీ చేయడం మనం చూస్తాము. అక్కడ భానుమతి కూడా పంచమి పెళ్లి పనులలో ఉంటుంది. సాంబయ్య గుడి దెగ్గర ఉండగా స్వామిజి అక్కడికి వెళ్తాడు. సాంబయ్యను చూసి ఏమి ఆలోచించావు సాంబయ్య అని అడుగుతాడు. దేని గురించి అని ఆరా తీయగా అదే పంచమిని నాతోపాటు ఆశ్రమానికి పంపడం గురించి అని చెప్తాడు స్వామిజి.

ఈ రోజు నా కూతురుకి పెళ్లి చూపులు అని తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు అండి అని అంటాడు సాంబయ్య. నీ కూతురు పెళ్లి చేసుకుంటే తల్లి మాత్రమే అవుతుంది అదే ఆశ్రమానికి పంపిస్తే పంచమికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ కూతురి కారణంగా నీ జన్మ ధన్యం అవుతుంది అంటదు స్వామిజి.
Naga Panchami Serial మే 10: పరమ శివుడు నీ కూతురికి ఇచ్చిన శక్తిని వృధా చేయకు
సాంబయ్య తో మాట్లాడుతూ స్వామిజి ఇలా అంటాడు ‘పరమ శివుడు నీ కూతురికి ఇచ్చిన శక్తిని పెళ్లి పేరుతో వృధా చేయకు’ కోరి వొచ్చిన అదృష్టాన్ని వొదనుకుంటే అది మీకు దురదృష్టంగా మారుతుంది అని అంటాడు స్వామిజి.

ఇంతలో అక్కడికి మోక్షను తీసుకుని వొచ్చిన వైదేహి స్వామిజి అని పిలుస్తుంది. సాంబయ్య గారు నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి పక్కకు వస్తారా అని అడుగుతుంది. దానికి సాంబయ్య లేదు అమ్మ ఇక్కడే మాట్లాడండి పర్లేదు అని అంటాడు. దేని గురించి చెప్పండి అని అంటాడు. అది మీ అమ్మాయి మా అబ్బాయిని పాము కాటునుంచి కాపాడింది దాని గురించే మాట్లాడదాం అని అనుకుంటున్నా అని అంటుంది వైదేహి.
నా కొడుక్కి సర్పగండం ఉందని గురువు గారు చెప్పారు. చెప్పినట్లే పాములు నా కొడుకు మీద పగబట్టాయి అని ఇక్కడికి వొచ్చిన తరువాతే అర్ధం అయింది. నా కొడుకును సర్పగండం నుంచి కాపాడగలిగేది మీ కూతురు పంచమి మాత్రమే అని సాంబయ్యకు దండం పెడుతుంది వైదేహి.

మీరు కోరినంత డబ్బు ఇస్తాను సాంబయ్య గారు
మీరు కోరినంత డబ్బు ఇస్తాను నా కొడుకుని కాపాడటానికి పంచమిని నాతో మా ఇంటికి పంపించండి సాంబయ్య గారు అని వేడుకుంటుంది వైదేహి. వైదేహి ని పట్టించు కోకుండా అప్పుడే అక్కడికి వోచిన గౌరీ పంచమిలను శివయ్య కు దండం పెట్టుకోమని చెప్తాడు సాంబయ్య. సాంబయ్య గారు నాతో పంపించామని అడుగుతుంటే మళ్ళీ పెళ్లి అంటారు ఏంటి అని అంటుంది వైదేహి.
అమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయిస్తున్నాము అంటే పంచమిని నీతో పంపమని అర్ధం లేకుండా మాట్లాడతావు ఏంటి అని అడుగుతాడు మోక్ష. మీరు కలలో కూడా ఊహించనంత డబ్బు ఇస్తాను అని సాంబయ్య తో మళ్ళీ అంటుండు వైదేహి. మీ పాత ఇల్లు కొత్త బంగ్లాగా మారుతుంది మీ జీవితం మొత్తం మారిపోతుంది అని సాంబయ్యని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది వైదేహి. ఒక వైపు వైదేహి మరోవైపు గురూజీ సాంబయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మోక్ష వైదేహి మీద కోపడుతాడు అప్పుడు వైదేహి నేను ఎవరికీ డబ్బు ఆశ చూపించట్లేదు రా నా కొడుక్కి ప్రాణ బిక్ష పెట్టమని ఆడుతున్నాను అని అంటుంది వైదేహి. మరి సాంబయ్య దీనికి చివరికి ఒప్పుకుంటాడా లేదా పంచమికి అనుకున్నట్లే పెళ్లి చేస్తాడా అని తెలుసుకోవాలి అంటే నాగ పంచమి ఈ రోజు ఎపిసోడ్ E39 డిస్నీ+ హాట్ స్టార్ లో చూడాల్సిందే.