Naga Panchami November 10 episode 197: వాళ్లు ఇద్దరూ అలా కుర్చీలో నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా సిసిరా వచ్చి అమ్మ నాకు స్నాక్స్ పెడుదువు గాని రా హోంవర్క్ చేసుకోవాలి అని అంటుంది. సిసిరా నన్ను అలాగే లేపవా లేస్తాను అని చిత్ర అంటుంది. చెడపకురా చెడేవు అనే సామెత ఉన్నట్టు పరులకు కీడు చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి అని సుబ్బు అంటాడు. ఏ సుబ్బు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మేము ఎవరికీ ఏమీ ఆపద తలపెట్టలేదు అని చిత్ర అంటుంది. అవునా అయితే భగవంతుడా మమ్మల్ని క్షమించు అని లేంపలు వేసుకోండి మీరు పైకి లేస్తారు అని స్వామి అంటాడు. తప్పైపోయింది స్వామి ఇంకెప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయము అని లేంపలేసుకుంటుంది చిత్ర . అక్క నేను కుర్చీలో నుంచి లేచాను అక్క నువ్వు కూడా లెంపలేస్కో భగవంతుడు క్షమిస్తాడు అని అంటుంది చిత్ర. నేను వేసుకోను అని జ్వాల అంటుంది.

అక్క లెంపలేసుకుంటే ఏమవుతుంది అక్క భగవంతున్ని క్షమించమని అడిగేది అని జ్వాల అంటుంది. నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయము అని లేంపలేసుకుంటుంది జ్వాలా . అక్క నువ్వు కూడా కుర్చీలో నుంచి లేచావా అక్క అని వాళ్ళిద్దరూ సంబరపడుతూ ఉంటారు. పరులకు ఎప్పుడు కీడు తలపెట్టకండి భక్తులను శిక్షించాలని చూస్తే ఆ భగవంతుడు నీకే శిక్ష వేస్తాడు అంటూ మాయమైపోతాడు సుబ్బు. ఇంతలో పంచమి లోపలికి వెళ్తుంది పంచమితో కలిసి సుబ్బు వెళ్తాడు. ఆ పంచమిని కాదు అక్క పంపించాల్సింది ఈ సుబ్బు గాన్ని పంపియ్యాలి ఆ పంచమి మాయలాడి అనుకుంటే దానికంటే ఎక్కువ మాయల వాడిలా ఉన్నాడు వీడు అని చిత్ర అంటుంది. కట్ చేస్తే, పంచమి ఏంటమ్మా మోక్ష ఇలా మాట్లాడుతున్నాడు జీవితమంతా అనుభవించి వైరాగ్యం పొందిన వాడిలా మాట్లాడుతున్నాడు వాడికి నీకు మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయా మీరిద్దరూ అన్యోన్యంగా ఉండడం లేదా ఎందుకమ్మా ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు అని శబరి అంటుంది.

చూడు పంచమి నిన్ను ఎప్పుడూ ఒక కూతురుగానే చూశాను నా మోక్ష లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను వాడేమో చావు బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మాకే అర్థం కావట్లేదు ఏం జరిగింది పంచమి అని వైదేహి అంటుంది. మోక్ష బాబు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా ఆయనకు చాలా ఇష్టం మా మధ్య ఏ గొడవలు లేవు బాగానే ఉన్నాము అని పంచమి అంటుంది. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే వాడు ఎందుకు అలా బాధపడుతూ నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు అలాగే మొన్న వాడిని పాము కాటేయడానికి వచ్చిందని తెలిసిన కానుంచి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాడి ప్రాణాలు కాపాడుతానని నాకు మాట ఇవ్వు నిన్ను మొదటిసారి చూసినప్పుడే మోక్ష ప్రాణాలు నువ్వే కాపాడుతావని నాకు అనిపించింది మేము ఎంతమందిని ఉన్నా వాడిని కాపాడలేము పంచమి నువ్వు ఒక్కదానివే వాడిని కాపాడగలవు అని శబరి అంటుంది.

నా ప్రాణం ఉన్నంతవరకు మోక్ష బాబుకు ఎలాంటి హాని కలగనివ్వను ఆయనని నేను కాపాడుతాను అని పంచమి అంటుంది. కట్ చేస్తే, పంచమి నేను ఎందుకు చచ్చిపోవాలి పంచమి నాకు ఏం జీవితం అయిపోయిందని ఇప్పుడే నా జీవితం ముగిసిపోతుంది, ఆ పాముకి నామీద ఎందుకు పంచమి అంత కక్ష ఏం చేశానని పాముల భాష నీకు అర్థం అవుతుంది కదా పంచమి ఆ పాము నన్ను ఎందుకు కాటేయాలనుకుంటుందో చెప్పు పంచమి అని మోక్ష అంటాడు. ఆ పాము తలరాత బాబు మీరు చేసేది ఏముంది చెప్పండి మిమ్మల్ని కాటేయాలనేది ఆ నాగజాతి పగ దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని పంచమి అంటుంది. అయితే ఆ పాము కాటుకి నేను బలైపోయి పోవాల్సిందేనా పంచమి ఎందుకు పంచమి ఆ పాము నన్ను కాటు వేయాలనుకుంటుంది, నాకు అప్పుడే చావాలని లేదు పంచమి జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను ఎలాగైనా నేను బ్రతకాలి పంచమి నేనెందుకు చావాలి పంచమి చెప్పు అని మోక్ష అంటాడు.

నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను కాపాడుకుంటాను మోక్ష బాబు మీరే ఒకప్పుడు చెప్పారు కదా చిన్నప్పుడు ఒక పామును కొట్టానని ఆ దెబ్బలు తిన్న పాము పెట్టిన శాపం ఇది అని పంచమి అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష వేస్తుందా పంచమి అని మోక్ష అంటాడు. ఈ పంచమి గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీకు ఏమీ కానివ్వను మోక్ష బాబు ఒకవేళ మీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే నా ప్రాణాలు అడ్డు వేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను మీరు నా భర్త మోక్ష బాబు గారు మిమ్మల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం మిమ్మల్ని కాపాడుకోలేని నాడు ఈ పంచమి భూమ్మీద ప్రాణాలతో ఉండదు అని పంచమి అంటుంది. కట్ చేస్తే, కరాలి వద్దని చెప్తున్నా మళ్లీ మళ్లీ నన్ను ఎందుకు ప్రసన్నం చేసుకుంటున్నావు కరాలి నీ కోరిక పరులను ఇబ్బంది పెట్టేలా ఉంది అలాంటి కోరికలు ఎప్పుడు ఫలించవు అని మహాకాళి అంటుంది.

అయితే నేను చేసిన పూజలు యజ్ఞ యాగాదులన్ని వృధా అయిపోతాయా మహాకాళి భక్తుల కోరికలు తీర్చడమే మీ పని నేను కోల్పోయిన వరాలను నాకు ప్రసాదించు ఆ మోక్షని వశం చేసుకొని ఆ పంచమిని సాధించి నాగమణి తెప్పించుకుంటాను మా అన్నయ్యను కాపాడుకుంటాను నేను కోల్పోయిన శక్తులన్నీ నాకు తిరిగి ఇవ్వు మహాకాళి అని నీలాంబరి అంటుంది. నీ అన్నని బ్రతికించుకోవాలనే స్వార్థంతో నువ్వు మళ్ళీ వరాలను అడుగుతున్నావు ఒక్కసారి వద్దని వదిలేసిన వరాలను మళ్లీ నువ్వు పొందలేవు కరాలి అది అసంభవం నీ కోరిక ఎప్పటికీ తీరదు అని మహాకాళి అంటుంది