టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య తాజాగా `కృష్ణ వ్రింద విహారి` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించాడు.
ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్గా నటిస్తే.. రాధిక, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాగశౌర్య పాదయాత్ర కూడా చేశాడు. ఈ పాదయాత్ర నాగశౌర్యకు బాగానే కలిసొచ్చింది. టాక్ అనుకూలంగా ఉండటం, ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. ఈ చిత్రం తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రెండో రోజు రాబట్టడం విశేషం.
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 95 లక్షల దాకా షేర్ ని అందుకుంటే.. రెండో రోజు రూ. 1.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అదరగొట్టింది. ఇక ఏరియాల వారీగా `కృష్ణ వ్రింద విహారి` 2 డేస్ టోటల్ వసూళ్లను ఓసారి గమనిస్తే..
నిజాం: 76 లక్షలు
సీడెడ్: 14 లక్షలు
ఉత్తరాంధ్ర: 16 లక్షలు
తూర్పు: 13 లక్షలు
పశ్చిమ: 9 లక్షలు
గుంటూరు: 15 లక్షలు
కృష్ణ: 12 లక్షలు
నెల్లూరు: 7 లక్షలు
——————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 1.62కోట్లు(2.70కోట్లు~ గ్రాస్)
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 10 లక్షలు
ఓవర్సీస్ – 42 లక్షలు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్: 2.14కోట్లు(3.80కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 5.20 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ.5.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 3.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది.
https://newsorbit.com/entertainment-news/krishna-vrinda-vihari-trailer-out-now.html
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!