Entertainment News సినిమా

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

Share

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు సాధారణ పరిస్థితి నెలకొనడంతో ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా ఫాన్స్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Nagababu planned a mega event on the occasion of Megastar's birthday..!!

ఇటువంటి తరుణంలో చిరంజీవి జన్మదినానికి ముందు రోజు ఆగష్టు 21 మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అభిమానుల కోసం కార్నివాల్ ఉంటుందని పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలు.. సినీ సెలబ్రిటీలు హాజరవుతారని నాగబాబు తెలియజేశారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవికి లెజెండ్ అన్న పదం కూడా చిన్నదేనని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు నాడు గాడ్ ఫాదర్, బోలా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించి అప్ డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలలో ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమాకి సంబంధించి ఆగస్టు 21వ తారీకు సాయంత్రం .. చిరంజీవి బర్త్డే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఉన్నట్లు అధికారికంగా తెలపడం జరిగింది.

Nagababu planned a mega event on the occasion of Megastar's birthday..!!

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో 21వ తారీకు “గాడ్ ఫాదర్” సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో.. గాడ్ ఫాదర్ తో అభిమానులను అలరించాలని ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అంట. మలయాళం “లుసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండాలు వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించారు.


Share

Related posts

Jenelia Deshmukh: పెళ్లయిన తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటున్న జెనీలియా..!!

sekhar

BREAKING: హీరో గా సిద్ శ్రీరామ్ ! చాలా పెద్ద డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టాడు !

somaraju sharma

KGF2: కేజిఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్..!!

P Sekhar