Nagapanchami november 11 2023 episode 198: నువ్వు వరములు ఇవ్వకపోయినా నేను నా శక్తులను సంపాదించి నా అన్నను బ్రతికించుకుంటాను అని కరాలి అంటుంది.నీ స్వార్థ బుద్ధి ఫలించదు కరాలి అది అసంభవం నీ స్వార్థం కోసం అయితే ఇంకొకసారి నన్ను ఎప్పుడు ప్రసన్నం చేసుకోకు కరాలి అని మహాకాళి అంటుంది. నాగమణిని సంపాదించిన తరువాత ఆ నాగమణి చూపించడం కోసం నిన్ను ప్రసన్నం చేసుకుంటాను మహాకాళి అప్పటిదాకా నిన్ను ప్రసన్నం చేసుకోను అని కరాలి అంటుంది.కట్ చేస్తే, నాగదేవతలందరూ ఒక దగ్గర చేరి మన యువరాణి భూలోకాoలోనే ఉండిపోయింది ఆ మోక్షాను కాటు వేసి మన లోకానికి రానంటుంది అని నాగదేవత అంటుంది.ఇప్పుడు ఏం చేయాలి మాత మళ్లీ పౌర్ణమి వచ్చేదాకా ఆగాల్సిందేనా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసి మన లోకానికి వచ్చి యువరాణిగా ఉండననే భూలోకంలో ఉండిపోతాను ఆ బంధం లోనే నిలిచిపోతాను అని మొండి పట్టు పట్టి కూర్చుంది మన యువరాణి మన లోకం కంటే తన భర్తప్రాణాలు ఎక్కువ అని నాగిని అంటుంది.

తనను ఎన్నో సార్లు భయపెట్టాను హెచ్చరించాను శాపం కూడా ఇస్తానన్నాను అయినా సరే తను దేనికి లొంగట్లేదు మన యువరాణి తిరిగి రావాలంటే మహా పౌర్ణమి వచ్చేంతవరకు ఆగాల్సిందే అని నాగదేవత అంటుంది.ఇంతలో నాగరాజు వచ్చి నేను కూడా యువరాణి వంశానికి చెందిన వాడినే మాత నేను ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాను అని నాగరాజు అంటాడు.నువ్వు యువరాణి వంశానికి సంబంధించిన వాడివే అయినా ఈ లోకాo సింహాసనం మీద కూర్చునేది ఒక యువరాణి మాత్రమే నాగ రాజులు కాదు అని నాగదేవత అంటుంది. అయితే యువరాణిని నేను తీసుకొస్తాను మాత యువరాణిని మెప్పించి పెళ్లి చేసుకుని తీసుకువస్తాను అని నాగరాజు అంటాడు. నీ కోరిక సామాన్యసమే కానీ ఇష్ట రూప నాగిని లు పవిత్రమైనవి వాటిని నియమ నిబంధనలను ఏమాత్రం ముల్లంగించకుండా తనను తీసుకురావాలి అని నాగదేవత అంటుంది. అలాగే మాత ఇన్ని రోజులు నాగినీలు చేయలేని పని నేను చేసి నిరూపిస్తాను అని నాగరాజు అంటాడు.

అలాగే కానీ భూలోకంలో ఉన్న మన యువరాణి ప్రేమానుబంధాలకు లొంగిపోయి శారీరిక సంబంధాలు పెట్టుకుంటే మాత్రం మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది మనం ఎంత చేసినా కానీ మన యువరాణి ని పవిత్రురాలిని చేయలేము అప్పుడు మనం చేసిన శ్రమ అంతా నిప్పులో పోసిన పన్నీరులా అయిపోతుంది అని నాగదేవత అంటుంది. అలాగే మాత నన్ను ఆశీర్వదించండి అని నాగరాజు అంటాడు. విజయోస్తు నాగలోకం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీకు శుభం కలుగుగాక అని నాగదేవత ఆశీర్వదిస్తుంది. కట్ చేస్తే మోక్ష వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తాడు. మోక్ష ఎంత ప్రయత్నించినా ఎన్ని బుక్కులు చదివినా నువ్వు చెప్పిన నాగదేవతల గురించి కొంతవరకే తెలిసింది ఇంకా ఏమైనా తెలిస్తే నీకు చెప్తాను అని వాళ్ళ సార్ అంటాడు. సార్ మీరు చెప్పిన చెప్పకపోయినా నాకు మాత్రం తెలుసు సార్ నా పక్కనే నా ఇంట్లోనే నాతోటే ఉంటూ నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య సార్ పంచమే ఇష్ట రూప నాగిని సార్ మీరు నమ్మలేని నిజం ఇది అని మోక్ష అంటాడు.

నేను నమ్మ లేకుండా ఉన్నాను మోక్ష అని వాళ్ళ సార్ అంటాడు. సార్ పంచమి పాము గా మారడం నా కళ్ళతో నేను చూశాను సార్ ఏ దేవుళ్ళని నమ్మని నేను ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన కానుంచి ఎవరు ఏది చెప్పినా నమ్మాలి అనిపిస్తుంది అని మోక్ష అంటాడు. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే మోక్ష ఆ పాము విషాన్ని పట్టుకొని టెస్ట్ చేస్తే దానికి మందు తయారు చేయగలమా లేకపోతే తయారైన మందులే ఉన్నాయా అనేది తెలుస్తుంది అని వాళ్ళ సార్ అంటాడు. పంచమి ప్రతి పౌర్ణానికి పాముగా మారుతుంది సార్ నన్ను కాటు వేయడానికి తప్పకుండా వస్తుంది పాముగా మారినప్పుడు నన్ను కాటు వేయాలని చూస్తుంది కానీ మనిషిగా ఉన్నప్పుడు నా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలు అడ్డువేస్తుంది ఓకే మనిషి రెండు విధాలుగా మారడం నేను ఎక్కడా చూడలేదు సార్ మొదటిసారిగా వింటున్నాను చూస్తున్నాను పంచమి పౌర్ణానికి పాముగా మారినప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం సార్ అప్పటిదాకా ఈ నిజాన్ని ఎవరితో చెప్పకండి అని మోక్ష అంటాడు

.
ఇది ఏ ఇంగ్లీషు సినిమ లాగానో ఉంది మోక్ష అని వాళ్ళ సార్ అంటాడు. ఓకే సార్ ఉంటాను అని మోక్ష వెళ్లిపోతాడు.కట్ చేస్తే పంచమి మోక్ష అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని మోక్ష బాబు చనిపోతాననే దృఢంగా నమ్ముతున్నాడు తనను ఎలాగైనా కాపాడుకోవాలి అంటే నా శక్తి సరిపోదు నాకు ఇంకొకరి సహాయం కావాలి భగవంతుడా నీవే రక్ష నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు నాతో ఉండి నన్ను ముందుకు నడిచేలా చేయి తండ్రి నా భర్త ప్రాణాలు నేను కాపాడుకోలేనప్పుడు నేను బ్రతికి ఉన్నా లేకున్నా ఒకటే అని పంచమి అనుకుంటుంది. కింద సుబ్రహ్మణ్యం ఒక చాపను పరుచుకొని చాప మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. తను చూసిన పంచమి కిందికి దిగివచ్చి పిలవబోతోంది కానీ పిలవకుండా ఆగిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది