Nagapanchami November 2 Episode 78: అమ్మ పంచమి ఎలా ఉన్నావు అని పంచమి వాళ్ళ అమ్మ అంటుంది.నేను బాగానే ఉన్నాను అమ్మ నా గురించి నువ్వు ఏం టెన్షన్ పడకు అని పంచమి అంటుంది. పంచమి నీ గొంతు వినగానే నాకు ప్రాణం లేచి వచ్చినంత పనైందమ్మా నువ్వు నా దగ్గరికి రా అమ్మ నిన్ను బంగారం లాగా చూసుకుంటాను ఈ లోకంలో నిన్ను ఎవరు ఏమి అనకుండా చూసుకుంటానమ్మా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు నువ్వేం టెన్షన్ పడకమ్మా త్వరలోనే వస్తాను అని పంచమి అంటుంది. మోక్ష బాబు మీ ఫోను అని పంచమి ఫోన్ ఇస్తుంది. మోక్ష ఫోన్ తీసుకోవడానికి భయపడతాడు. పంచమి ఆ పక్కన ఉన్న టేబుల్ పైన ఫోన్ పెట్టి వెళ్ళిపోతుంది.

పంచమి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి,మోక్ష బాబు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను బహుశా మళ్లీ మనం ఎప్పుడు కలవక పోవచ్చు, నావల్ల మీ జీవితంలో జరిగిన కష్టనష్టాలకు నేనే బాధ్యురాలిని నన్ను క్షమించండి అంటుంది. భార్యగా నేను మీకు న్యాయం చేయలేదు, నావల్ల ఎవరికి సంతోషం లేదు, నేను ఈ లోకంలో ఉండడానికి అర్హురాలని కాదు, అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను పంచమి ఒక కల మళ్లీ మీ జీవితంలో ఆ కల రాదు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్తుంది పంచమి. పంచమి నాతో చెప్పాల్సిన విషయాలు ఇంకేమీ లేవా అని అడుగుతాడు మోక్ష. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోవాలి,వదులుకోవటం వదిలించుకోవటం చాలా తేలిక కానీ దాని పర్యవసానం అనుభవించాల్సింది నేనే అని మోక్ష అంటాడు.

నా జీవితం చీకటిమయం అయిపోయింది ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయం నాదే అని మోక్ష అంటాడు. కట్ చేస్తే,అందరూ రండి అని చిత్ర గట్టిగా పిలుస్తుంది. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నారు అని రఘు అంటాడు. ఆరోజు నంబూద్రి గారు పట్టుకున్న పాము రాత్రి మన ఇంటికి వచ్చింది. అదే పాము మళ్లీ వచ్చిందని మీరెందుకు అనుకుంటున్నారు అని వాళ్ల పిన్ని అంటుంది.అయితే రాత్రి ఆ విషయం చెప్పక ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని రఘు అంటాడు. అంటే పాము మోక్షని కాటు వేయడానికి వచ్చిందేమో అనుకొని మేము ఊరుకున్నాము అని జ్వాల అంటుంది. అంటే పాము మోక్షని కాటు వేసి చంపేయాలనుకున్నారా మీరిద్దరూ అని వాళ్ళ అత్తయ్య అంటుంది. మోక్షని కాపాడడానికి పంచమి ఉంది కదా అని చిత్ర అంటుంది. ఆ సంగతి వదిలేసి ఆ పాము ఇక్కడికి వచ్చింది ఎవరికోసమో అడగండి పంచమిని అని జ్వాల అంటుంది.

పంచమి ఆ పాముకి నీకు ఎటువంటి సంబంధం లేదని వీళ్ళ నోరు మూయించు అని వాళ్ళ బావ అంటాడు. ధైర్యం ఉంటే సంబంధం లేదని చెప్పమనండి ఇప్పుడు డైరెక్ట్ గా దొరికిపోయింది కదా అని జ్వాల అంటుంది. ఆ విషయం నేను చెప్తాను విను రఘు ప్రతి పౌర్ణమికి మోక్షని పాము కాటేయడం అనేది నిజం రాత్రి కూడా అలాగే పాము వచ్చి ఉంటుంది అని శబరి అంటుంది.నువ్వు చెప్పింది అంతా నిజమే బామ్మా కానీ ఆ పాము నుంచి నన్ను నేనే కాపాడుకున్నాను ఇన్ని రోజులు మీరు చెప్తే నేను నమ్మలేదు కానీ రాత్రి తెలిసింది ఆ పాము నన్ను కాటేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది ఆ పాముకి నా మీద అంత పగ ఏంటో అర్థం కావట్లేదు అని మోక్ష అంటాడు. మోక్ష నువ్వు చెప్పేది నిజమా అని రఘు అంటాడు.

అవును నాన్న వదినలు చూసిన పాము నిజంగానే మన ఇంటికి వచ్చింది అని మోక్ష అంటాడు. మోక్ష నువ్వు చెప్పేదంతా నిజమని మేము ఎలా నమ్మాలి అని వాళ్ళ అమ్మ అంటుంది. నేను చెప్పేదంతా నిజం అమ్మ రాత్రి నన్ను పాము కాటు వేయడానికి ఎలా బుసలు కొట్టిందో నాకు తెలుసు పాములు అంతగా పగ పడతాయని నాకే ఆశ్చర్యంగా ఉంది నేనే నమ్మలేకపోతున్నాను అని మోక్ష అంటాడు. పాము వచ్చినప్పుడు కాపాడడానికి పంచమి నీ పక్కనే ఉంది కదా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ఆ టైంలో తను నా పక్కన లేదు అని మోక్ష అంటాడు. అదేంటి మోక్ష నీ పక్కనే ఉండాలి కదా అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

పంచమి రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు అని రఘు అంటాడు. తను పైకి వెళ్లిందని అనుకున్నాను అని మోక్ష అంటాడు. ఇందులో ఏదో హిస్టరీ దాగుందనిపిస్తుంది అని జ్వాల అంటుంది. అవును హిస్టరీ తిరిగేసైనా సరే నిజం తెలుసుకుంటాను అని మోక్ష అంటాడు. నువ్వే అన్నావు కదా మోక్ష రాత్రి ఆ పాము కాటు వేయడానికి వచ్చిందని అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నన్ను చంపడం కోసమే ఆ పాము వచ్చి మన ఇంట్లో దాక్కుందా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని మోక్ష అంటాడు.అంటే నువ్వు కూడా మాలాగే పంచమిని అనుమానిస్తున్నావా అని చిత్ర అంటుంది. నిజమేంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది అని మోక్ష అంటాడు.