Akhil: నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్.. తన స్టామినాకి తగ్గ హిట్టు ఇప్పటివరకు పట్టలేకపోయాడని అభిమానులే అంటుంటారు. గ్లామర్ పరంగా ఇంకా ఫైట్స్, డాన్స్ పరంగా అంత పర్ఫెక్ట్ గా ఉన్న… సరైన బొమ్మ ఇప్పటివరకు అఖిల్ కి పడలేదని చెబుతుంటారు. అఖిల్ కెరియర్ కి సంబంధించిన నాగార్జున చాలా సందర్భాలలో ఇన్వాల్వ్ అయ్యి.. చాలా శ్రద్ధ తీసుకున్నా గాని సరైన హిట్ పలకరించకపోవడం అక్కినేని అభిమానులకు కూడా కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” అనే సినిమా అఖిల్ చేస్తూ ఉన్నాడు.
ఈ సినిమాలో జేమ్స్ బాండ్ మాదిరి కండలు మరియు ఆతరః మేనరిజం లుక్స్ లో అఖిల్ కనిపిస్తూ ఉన్నాడు. “ఏజెంట్” కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా లెవెల్ సబ్జెక్టులు కలిగిన సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటూ ఉన్నారు. దీంతో ఇప్పుడు కొడుకు అఖిల్ నీ కూడా ఇతరహాలోనే ముందుకు తీసుకెళ్లడానికి నాగార్జున బిగ్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త నటీనటులను లాంచ్ చేయడంలో నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడు కూడా ముందుంటారు.
దీంతో ఇప్పుడు కొడుకు అఖిల్ బాధ్యతలను పూర్తిగా కరణ్ జోహార్ చేతిలో నాగార్జున పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కరణ్ జోహార్ విజయ్ దేవరకొండనీ.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి “లైగర్” ద్వారా లాంచ్ చేయటం మనం చూసాం. ఇప్పుడు అక్కినేని అఖిల్ నీ లాంచ్ చేయటానికి కరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా సైతం కోడై కూస్తుంది. త్వరలోనే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి వార్త రానన్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!