33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

శత్రువుల‌ను చీల్చి చెండాడిన నాగ్‌.. ఆక‌ట్టుకుంటున్న `ఘోస్ట్` గ్లింప్స్!

Share

ఈ ఏడాది ఆరంభంలోనే `బంగార్రాజు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం `ది ఘోస్ట్‌` అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఓటీటీలో విడుద‌ల కానుందంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారానికి పుల్లిస్టాప్ పెడుతూ మేక‌ర్స్ తాజాగా కిల్లింగ్ మెషిన్ పేరుతో `ఘోస్ట్` గ్లింప్స్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ సంద‌ర్భంగా సినిమా రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక్టోబర్ 5 అంటే విజయ దశమి నాడు ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక గ్లింప్స్ విష‌యానికి వ‌స్తే..

వెన్నెల రాత్రి శ‌త్రువుల‌ను ఓ భారీ క‌త్తితో చీల్చి చెండాడుతూ నాగార్జున‌ ఫార్మల్ సూట్‌ లో ఫెరోషియస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆక‌ట్టుకుంటున్న ఈ గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక‌పోతే ఈ చిత్రంలో నాగ్ మ‌రియు సోనాల్ చౌహ‌న్‌లు రా ఏజెంట్స్‌గా అల‌రించ‌బోతున్నారు.


Share

Related posts

Pooja hegde : పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ ఇవ్వని రెమ్యూనరేషన్ కోలీవుడ్ ఎలా ఇస్తుంది..?

GRK

RRR: “RRR” కోసం “మగధీర” ప్లాన్ వేసిన రాజమౌళి..!!

sekhar

చనిపోయే ముందు గూగుల్ లో అందుకోసం సెర్చ్ చేశాడా? 

sekhar