Entertainment News సినిమా

`ది ఘోస్ట్‌` కోసం ఆ హీరోలిద్ద‌రి సాయం తీసుకుంటున్న నాగ్‌..ఫ్యాన్స్‌కి పండ‌గే!?

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ది ఘోస్ట్‌`. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మించారు. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేసిన మేక‌ర్స్‌.. `ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబ‌ర్ 25న క‌ర్నూలులోని ఎస్‌టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

nagarjuna the ghost movie
nagarjuna the ghost movie

అయితే ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా ఎవ‌రు రాబోతున్నారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. `ది ఘోస్ట్‌` కోసం నాగార్జున టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు హీరోల సాయం తీసుకుంటున్నాడ‌ట‌. ఆ హీరోలు మ‌రెవ‌రో కాదు.. ఆయ‌న త‌న‌యులు అఖిల్‌, నాగ‌చైత‌న్య‌లు అట‌.

ఘోస్ట్ కోసం గెస్ట్‌లుగా రావ‌డానికి అఖిల్‌, చైతూలిద్ద‌రూ గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం అక్కినేని అభిమానుల్లో ఫుల్ జ్యోష్‌ను నింపింది. మ‌రి నిజంగానే `ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అఖిల్‌, నాగ‌చైత‌న్య‌లు గెస్ట్‌లుగా వ‌స్తే.. అది ఖ‌చ్చితంగా ఫ్యాన్స్‌కి క‌న్నుల పండ‌గే అవుతుంది.


Share

Related posts

Nidhhi Agerwal: కండోమ్ బ్రాండ్‌కి నిధి ప్ర‌చారం.. కామెంట్‌ బాక్స్ నిండా బూతులే!

kavya N

Vakeel saab – chiranjeevi : వకీల్ సాబ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్.. అంటున్న చిరు ట్వీట్ వైరల్.. 

bharani jella

ఇలా అయితే ఇక అందరూ వకీల్ సాబ్ మీద ఆశలు వదిలేసుకుంటారేమో ..?

GRK