Entertainment News సినిమా

చిరంజీవి ఉన్నా, ఇంకెవ‌రున్నా త‌గ్గేదేలే అంటున్న నాగార్జున‌!

Share

`బంగార్రాజు` సినిమాతో ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున‌.. ఇప్పుడు `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మించారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాల్‌ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తే.. గుల్‌ పనగ్‌, అనిక సురేంద్రన్‌ కీలక పాత్రలను పోషించారు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నార‌ని ఎప్పుడో ప్ర‌క‌టించారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా షురూ చేశారు.

nagarjuna the ghost
nagarjuna the ghost

కానీ, అదే రోజు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌` చిత్రం కూడా విడుద‌ల అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే చిరు కోసం నాగార్జున వెన‌క్కి త‌గ్గుతున్నాడ‌ని, `ది ఘోస్ట్` విడుద‌ల వాయిదా ప‌డ‌నుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ మూవీ రిలీజ్‌పై అభిమానుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

అయితే బ‌రిలో చిరంజీవి ఉన్నా, ఇంకెవ‌రున్నా నాగార్జున మాత్రం త‌గ్గేదేలే అంటున్నారు. అవును, `ది ఘోస్ట్‌` విడుద‌ల ఎలాంటి మార్పులు జ‌ర‌గ‌డం లేదు. ఈ చిత్రం విడుదలపై ఇప్పటిదాకా నెలకొన్న ఊగిసలాటకు దర్శకుడు చెక్ పెట్టారు. అక్టోబరు 5నే త‌మ చిత్రం రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. దాంతో ఈ దసరాకు నాగ్ `ది ఘోస్ట్‌` రావ‌డం ఖాయమైంది.


Share

Related posts

RRR: కౌంట్‌డౌన్ స్టార్ట్..’రామ్ – భీమ్’ల కొత్త పోస్టర్ వదిలిన జక్కన్న టీమ్..

GRK

యాక్ష‌న్ టైమ్ అంటున్న విశాల్‌

Siva Prasad

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

Siva Prasad