టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం `ది ఘోస్ట్`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, గ్లింప్స్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ సినిమాపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ రిలీజ్ రెండు రోజులు ఆలస్యం కానుందట. అయితే తెలుగుతో కాదండోయ్.. హిందీలో. అవును, `ది ఘోస్ట్`ను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.
హిందీలో ఈ సినిమాకు విక్రమ్ ది ఘోస్ట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే హిందీ రిలీజ్‌ను కాస్త లేటుగా ప్లాన్ చేశారు. అందువల్లనే అక్కడ రెండు రోజులు ఆలస్యంగా అంటే అక్టోబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!