టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం.. ఇప్పటికే సెన్సాన్ పనులను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ను అందుకుంది.
ఇక తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. మేకర్స్ ఈ మూవీకి 135 నిమిషాల రన్ టైమ్ను లాక్ చేశారట. అంటే ఈ సినిమా నడివి రెండు గంటల పదిహేను నిమిషాలు. అయితే ఇటీవల కాలంలో దాదాపు ప్రతి సినిమా రెండున్నర గంటలకు పైగా నడివితో వస్తున్నాయి.
వాటితో పోలిస్తే `ది ఘోస్ట్` రన్ టైమ్ చాలా తక్కువ. అయితే కంటెంట్ ఉంటే.. రన్ టైమ్తో పని లేదు. పైగా రన్ టైమ్ తక్కువ ఉంటే.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఏదేమైనా తక్కువ రన్ టైమ్ సినిమాకు ప్లాస్ అయ్యే అంశమే అని చెప్పాలి.