33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

కత్తిని త‌యారు చేసి యుద్దానికి సిద్ధ‌మైన నాగ్‌.. అదిరిన `ఘోస్ట్‌` ప్రోమో!

Share

`బంగార్రాజు` వంటి హిట్ అనంత‌రం కింగ్ నాగార్జున చేస్తున్న చిత్రం `ది ఘోస్ట్‌`. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ల పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విక్రమ్ గాంధీ అనే ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నాగార్జున, ఆయ‌న సబార్డినేట్ ప్రియగా సోనాల్ చౌహాన్ క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ని తెలియజేస్తూ ఇటీవల చిత్రబృందం.. `తమ హగనే` అనే పదానికి అర్థమేమిటో తెలుసా..? అని ప్ర‌శ్నించింది.

 

అప్ప‌టి నుంచి `తమ హగనే`కు అర్థం తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులు, నెటిజ‌న్లు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే తాజాగా `తమ హగనే` అంటే `విలువైన ఉక్కు` అని అర్థం చెబుతూ `ది ఘోస్ట్‌` ట్రైల‌ర్ ప్రోమోను బ‌య‌ట‌కు వ‌దిలింది. `విక్రమ్.. నువ్వు ఎక్కడున్నావో వారికి తెలిసిపోయింది. యావత్ అండర్ వరల్డ్ నీ గురించి వస్తున్నారు` అనే అమ్మాయి వాయిస్‌కు నాగార్జున “రానీ..“ అని రిప్లయ్ ఇవ్వడంతో ప్రోమో స్టార్ట్ అయింది.

ఆ త‌ర్వాత నాగ్ తన వద్ద ఉన్న విలువైన ఉక్కుతో కత్తిని త‌యారు చేసుకుని యుద్దానికి రెడీ అవుతుండడాన్ని చూపించారు. మొత్తానికి అదిరిపోయిన ఈ ప్రోమో సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక పూర్తి ట్రైల‌ర్ ఆగ‌స్టు 25న బ‌య‌ట‌కు రాబోతోంది. మ‌రి ఈ ట్రైల‌ర్ ఏ రేంజ్‌లో అల‌రించ‌నుందో చూడాలి.


Share

Related posts

Hari hara veeramallu: ‘హరి హర వీరమల్లు’ నిరాశపరుస్తున్నాడా..క్రిష్ సైలెంట్‌గా ఎందుకున్నాడు..?

GRK

Shivathmika Rajasekhar: ప్రియుడితో పారిపోయిన రాజ‌శేఖ‌ర్ కూతురు.. శివాత్మిక స్ట్రోంగ్ వార్నింగ్‌!

kavya N

Shanmukh Jaswanth : షణ్ముఖ్ గురించి ‘ ఆ న్యూస్ ‘ తెలియగానే దీప్తి సునైనా రియాక్షన్ ఏంటి ?

Ram