NewOrbit
Entertainment News సినిమా

నాగార్జున `ది ఘోస్ట్‌`కు అన్ని కోట్ల న‌ష్ట‌మా..? ఇది మ‌రీ దారుణం!

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున రీసెంట్‌గా `ది ఘోస్ట్‌` అనే హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డం, పోటీగా చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌` ఉండ‌టంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ దారుణంగా బోర్లా ప‌డింది. తాజాగా రెండు వారాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్ల రేంజ్‌లో షేర్‌ను రాబ‌ట్ట‌గా, వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 5.98 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా ది ఘోస్ట్ 2 వీక్స్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

Advertisements
the ghost movie two weeks collection
the ghost movie two weeks collection

నైజాం: 1.80 ల‌క్ష‌లు
సీడెడ్: 65 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 89 ల‌క్ష‌లు
తూర్పు: 38 ల‌క్ష‌లు
పశ్చిమ: 21 ల‌క్ష‌లు
గుంటూరు: 42 ల‌క్ష‌లు
కృష్ణ: 42 ల‌క్ష‌లు
నెల్లూరు: 23 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌= 5.00 కోట్లు(8.90 కోట్లు~ గ్రాస్‌)
————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 36 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్: 62 ల‌క్ష‌లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 5.98 కోట్లు(11.05 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 16.02 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ టార్గెట్‌ను అందుకోవ‌డం ఇక క‌ష్ట‌మే. దీంతో `ది ఘోస్ట్‌` మూవీకి రూ. 15 కోట్ల‌కు పైగా న‌ష్టాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.


Share

Related posts

Kangana Tabu: బాలీవుడ్ పరువు కాపాడావు అంటూ టాబుపై కంగనా సంచలన కామెంట్స్..!!

sekhar

కోన వెంకట్ “క‌ర‌ణం మల్లేశ్వరి” గా తాప్సీ ..!

GRK

Prabhas: ప్రభాస్ ‘ఆది పురుష్‌’ శ్రీరాముడి లుక్ అదుర్స్.. పూనకాలు తెప్పిస్తున్న పోస్టర్.!

Ram