30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News సినిమా

నాగార్జున ఎన్నిసార్లు అడిగినా రాజ‌మౌళి అందుకు ఒప్పుకోవ‌ట్లేదా?

Share

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియా వైడ్‌ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుల్లో రాజమౌళి ఒకరు. అపజయం ఎరుగని దర్శకుడు గా గుర్తింపు పొందిన రాజమౌళితో సినిమా చేయాలని హీరోలు తహతహలాడుతుంటారు. ఈ విషయాన్ని చాలా మంది హీరోలు బహిరంగంగానే వెల్లడించా.

అయితే ఇప్పుడు ఈ లిస్టులో కింగ్ నాగార్జున కూడా చేరిపోయారు. కానీ, నాగార్జున త‌న‌తో సినిమా చేయ‌మ‌ని ఎన్నిసార్లు అడిగినా రాజ‌మౌళి ఒప్పుకోవ‌ట్లేదాట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాను కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ `బ్రహ్మాస్త్ర` మంచి విజయం సాధించడంతో నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్న నాగార్జునకు ఎదురైంది.

Nagarjuna
Nagarjuna

అందుకు ఆయన ఆ టైం కోసం నేను ఎదురు చూస్తున్నారని తెలిపారు. `నాతో సినిమా తీయమని రాజమౌళిని త‌ర‌చూ అడుగుతుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారీ ఆయన నుంచి చిరునవ్వే స‌మాధానంగా వ‌స్తుంటుంది. రాజమౌళి కథని నమ్మే దర్శకుడు. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక దానికి తగ్గ నటుల్ని వెతుక్కుంటారు. మరి ఆయన కథలకి నేనెప్పుడూ సరిపోతానో చూడాలి` అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

కాగా, రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతోనే ఎక్కువ సంఖ్యలో సినిమాలను తీశాడు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియ‌ర్ స్టార్స్‌తో ఆయ‌న‌ సినిమాలు చేసిందిలేదు. అయితే ఇక‌ముందైనా రాజ‌మౌళి సీనియ‌ర్ హీరోల‌తో సినిమా చేస్తారా..లేదా.. అన్న‌ది చూడాలి.

https://www.instagram.com/p/BsaM_z6n6yt/?utm_source=ig_web_copy_link


Share

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ చెల్లెలిగా సెన్సేషనల్ హీరోయిన్..??

sekhar

Devatha Serial: ఆదిత్య వాళ్ళ ఇంట్లో దేవి పుట్టినరోజు సంబరాలు.. మాధవ్ ఒప్పుకున్నాడా..!?

bharani jella

దాస‌రి త‌న‌యుడు వ‌చ్చేశాడు

Siva Prasad