Naga Shourya: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో నాగశౌర్య ఒకరు. “క్రికెట్, గర్ల్స్, బీర్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గాని “ఊహలు గుసగుసలాడే” సినిమాతో ఫస్ట్ విజయం అందుకుని మంచి గుర్తింపు సాధించాడు. నటనపరంగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ ఒకపక్క యూత్ మరోపక్క కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ జయపజయాలతో సంబంధం లేకుండా నాగశౌర్య దూసుకుపోతూ ఉన్నాడు.
డైరెక్టర్ హీరోగా ఇండస్ట్రీలో పేరున నాగశౌర్య… “కృష్ణ వ్రింద విహారి” సినిమాతో సెప్టెంబర్ 23వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. వరుస పరాజయాల బాటలో ఉన్న శౌర్యకి మరో పరాజయం “కృష్ణ వ్రింద విహారి” రూపంలో రావడంతో ఆయన అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఏకంగా నాగశౌర్య పాదయాత్ర కూడా చేశారు. తిరుపతి, గుంటూరు, నెల్లూరు, భీమవరం, విజయవాడ, ఏలూరు, ఒంగోలు, విశాఖపట్నంలో పాదయాత్ర చేయడం జరిగింది.
పాదయాత్రలో అభిమానులకి సెల్ఫీలు ఇస్తూ చాలా వెరైటీగా.. “కృష్ణం వ్రింద విహారి” ప్రమోషన్స్ చేశారు. అయినా గాని సినిమా పరాజయం పాలు కావటం.. ఫ్యాన్స్ కి నిరుత్సాహం కలిగించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశాలకు కూడా నాగశౌర్య హాజరయ్యారు. ఈ క్రమంలో సినిమాలో పెళ్లి తర్వాత హీరోయిన్ తో రొమాన్స్ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో విలేకరులలో ఒకరు… మీ పెళ్ళెప్పుడు అని నాగశౌర్య నీ ప్రశ్నించారు. దానికి శౌర్య సమాధానమిస్తూ ఈ ఏడాది చివరిలో ఉండొచ్చు. అంతేకాదు తెలుగు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నారు. దీంతో చాలావరకు శౌర్య బంధువులలో ఉన్న అమ్మాయి తోనే వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.