22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Entertainment News సినిమా

టీవీ రంగంలోకి నమ్రతా.. గుడ్‌న్యూస్ చెప్పిన మ‌హేశ్ స‌తీమ‌ణి!

Share

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1993 లో మిస్ ఇండియాగా ఎంపికైన న‌మ్ర‌తా.. మొద‌ట బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అక్క‌డ డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు చేసింది. అలాగే మ‌హేశ్ బాబు హీరోగా తెర‌కెక్కిన `వంశీ` మూవీతో ఇటు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే న‌మ్ర‌త తెలుగులో ఎక్కువ సినిమాలు చేయ‌లేదు. అంద‌కు కార‌ణం ఆమె త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేశ్ బాబును పెళ్లాడ‌ట‌మే. మ‌హేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న న‌మ్ర‌త‌.. వివాహం అనంత‌రం న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసింది. ఆపై గౌతం కృష్ణ, సీత‌ర‌ల‌కు జ‌న్మినిచ్చింది. ఇక‌పోతే ఇన్నాళ్లు ఫ్యామిలీకే త‌న పూర్తి స‌మ‌యాన్ని కేటాయించిన న‌మ్ర‌త‌.. ఇప్పుడు టీవీ రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది.

ఈ గుడ్‌న్యూస్‌ను స‌మ్ర‌త స్వ‌యంగా వెల్ల‌డించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న న‌మ్ర‌త‌.. `ఫ్యామిలీని చూసుకోండం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పెళ్లి తర్వాత సినిమాలు వదులకున్నా నాకు ఎలాంటి బాధలేదు. ప్రస్తుతం యాక్టింగ్‌ చేసే ఆలోచన లేదు. కానీ, నాకు ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతుంది.

అందుకే ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటా. ఇప్పుడు టీవీ రంగానికి సంబంధించి ప్రొడ్యూసింగ్‌ కంపెనీ స్టార్ట్‌ చేశా. దాని నుంచి మంచి కంటెంట్‌ ప్రేక్షకులకు అందించాలనుంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నా. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కాబట్టి నాకు కూడా కాస్త తీరిక దొరికింది` అని పేర్కొన్నారు. ఇక న‌మ్ర‌త చెప్పిన ఈ గుడ్‌న్యూస్‌తో మ‌హేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.


Share

Related posts

Prabhas: ప్రభాస్ తో చేయబోయే సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..!!

sekhar

Rana Daggubati: పెళ్లవ్వ‌డం వ‌ల్లే సంయుక్త‌తో అలా చేశా.. రానా షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Asalem jarigindi movie review : ‘అసలేం జరిగింది’ సినిమా అభిమానులు మెప్పించిందా..?

sekhar