Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు మోక్షజ్ఞ తేజ అధికారికంగా తెలిపాడు. అయితే ఆయన ఎటువంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కూడా మోక్షజ్ఞ క్లారిటీ ఇచ్చాడు.
దాంతో నందమూరి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా ఓ గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య కరోనా నుంచి కోలుకున్నారట. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిండని ఓ టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంతేకాదు, బాలయ్య ఈస్ బ్యాక్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `ఎన్బీకే 107`ను చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అరవై శాతం కంప్లీట్ అయింది. అయితే బాలయ్యకు కరోనా సోకడంతో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు ఆయన కోలుకోవడంతో చిత్రీకరణను రీస్టార్ట్ చేస్తున్నారట. బాలయ్య వచ్చే వారం నుండి బరిలోకి దిగబోతున్నారని.. ఇక గ్యాప్ లేకుండా షూటింగ్ ను ఫినిష్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!