`శ్యామ్ సింగరాయ్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన న్యాచురల్ స్టార్ నాని.. `అంటే.. సుందరానికీ!`తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు. ప్రస్తుతం నాని చేస్తున్న చిత్రం `దసరా`. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీగా ఎత్తున సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించనంత ఊరమాస్ లుక్లో అలరించబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఈ మూవీ విడుదలకు మేకర్స్ డేట్ లాక్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ ఓ అధికారిక పోస్టర్ను బయటకు వదిలారు. ఈ పోస్టర్లో మాసిన గడ్డం, ఒళ్లంత మట్టి, చేతిలో క్వార్టర్ బాటిల్ పట్టుకుని ఉన్న నాని సిల్క్ స్మిత బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఉన్న గోడకి ఆనుకుని కూర్చుని కనిపిస్తున్నాడు.
నానితో పాటు సిల్క్ స్మిత లుక్ కూడా ఆకట్టుకోవడంతో.. ఈ పోస్టర్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇకపోతే `దసరా`ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ మూవీతో అయినా నాని సక్సెస్ ఎక్కుతాడా..లేదా.. అన్నది.
MARCH 30TH WORLDWIDE 🔥#EtlaitheGatlayeSuskundhaam
This one will be remembered for a long time🖤
Telugu – Tamil – Malayalam – Kannada – Hindi #DASARA pic.twitter.com/70PuwsnIhq
— Nani (@NameisNani) August 26, 2022