Nayanthara: చెన్నైలో న‌య‌న్ కొత్త ఇళ్లు.. ఇంటీరియర్‌ డిజైన్‌కే క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌!?

Share

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌నతార ఇటీవ‌ల ఇష్ట‌స‌ఖుడు, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న కంటే ఏడాది చిన్న‌వాడైన విఘ్నేష్ శివ‌న్ తో గ‌త ఏడేళ్ల నుండి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న న‌య‌న్‌.. ఎట్ట‌కేల‌కు జూన్ 9న అత‌డితో క‌లిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ – విఘ్నేష్ ఒక‌ట‌య్యారు. వివాహం అనంత‌రం ప‌లు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన ఈ నూతన జంట‌.. ఆపై బ్యాంకాక్ లో హ‌నీమూన్‌ను ఎంజాయ్ చేసి వ‌చ్చారు. ఇక హ‌నీమూన్ అనంత‌రం నయనతార, విగ్నేష్ శివన్ తన చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు.

అలాగే మ‌రోవైపు కొత్త కాపురానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే న‌య‌న్ చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలో పోయెస్‌ గార్డెన్‌ అంటే సెలబ్రెటీలకు కేరాఫ్‌. ఈ ప్రాంతంలోనే రజనీకాంత్, జయలలిత లాంటి ప్రముఖుల నివాసాలు ఉన్నాయి.

అలాంటి ప్రాంతంలో రెండు విలాసవంతమైన ఇళ్ల‌ను కొనేసిన న‌య‌న్‌.. త్వ‌ర‌లోనే అక్క‌డ‌కు భ‌ర్త‌తో ఫిస్ట్ కాబోతోంది. ఈ వార్త‌కే గ‌తంలోనే వైర‌ల్ అయింది. అయితే ప్ర‌స్తుతం న‌య‌న్ ఆ రెండు ఇళ్లలో ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటుంద‌ట‌. అందుకోసం బాలీవుడ్ సెలెబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే సంస్థతో ఏకంగా రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఇంటీరియర్‌ డిజైన్‌కే రూ. 25 కోట్ల బ‌డ్జెటా అంటూ నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

34 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

43 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago