సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్‌తో ఏడడుగులు నడిచింది. దాదాపు ఏడేళ్ల నుండీ ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట.. ఫైనల్‌గా జూన్ 9న వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
కుటుంబసభ్యులు, సన్నిహితులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం నయన్-విఘ్నేష్‌ల పెళ్లిలో సందడి చేశారు. వివాహం అనంతరం నయన్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంటనే షూటింగ్స్‌లో బిజీ అయిపోయింది. అలాగే మొన్నామధ్య తన 75వ చిత్రాన్ని సైతం అనౌన్స్ చేసింది.
భర్తను కౌగిట్లో భందించి ఊపిరాడకుండా చేసిన నయన్.. ఫొటో వైరల్!
ఈ చిత్రం ద్వారా నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. చెన్నైల్లో ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ మూవీకి నయన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాకు నయన్ ఏకంగా రూ. 10 కోట్లు అందుకుంటోందట. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్ల రేంజ్లో పారితోషికం తీసుకునే నయన్.. ఇప్పుడు అమాంత పెంచేసి డబుల్ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసింది. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు వెనకడుగు వేయలేదని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.