Nayanthara: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తనకంటే ఒక సంవత్సరం చిన్నవాడైన కోలీవుడ్ దర్శనిర్మాత విఘ్నేశ్ శివన్‌తో నిన్న ఉదయం ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. తమిళనాడులోని మహాబలిపురం షెరటాన్ హోటల్ లో కుటుంబసభ్యులు, సన్నిహిత సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.
వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇకపోతే వివాహానంతరం నేడు ఈ కొత్త జంట తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు. శుక్రవారం తిరుమలకు చేరకున్న నయన్, విఘ్నేష్ శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఆపై స్వామివారిని దర్శించుకున్న నయన్-విఘ్నేశ్‌లను అర్చకులు తీర్థప్రసాదాలతో ఆశీర్వదించారు.
ఇందంతా బాగానే ఉంది కానీ.. నయన్ తిరుమలలో చేసిని ఓ పని నెటిజన్లు ఆగ్రహానికి గురి చేసింది. స్వామి వారిని దర్శించుకున్నాక.. ఆలయం వెలుపల నయన్ దంపతులు ఫోటోషూట్ చేశారు. ఫోటోలు తీసుకుంటే ఫర్వాలేదు. ఐతే అత్యంత పవిత్రమైన తిరుమాడ వీధుల్లో నయన్ చెప్పులు వేసుకుని నడిచింది..
ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం నిషేదం. నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరిగినందుకు స్వామి వారిని క్షమాపణ కోరాలంటూ నవవధువుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి పెళ్లైన రెండో రోజే అడ్డంగా బుక్కైన నయన్.. ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…