Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్‌లు ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. గత ఏడేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట.. నిన్న ఉదయం తమిళనాడులోని మహాబలిపురం షెరటాన్ హోటల్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు.
కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే పెళ్లిలో నయన్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లిలో నయనతార మోనికా, కరిష్మా చేత జాడే అని లేబుల్ చేయబడిన స్కార్లెట్ రెడ్ కలర్ డిజైనర్ శారీని కట్టుకుని యువరాణిలా మెరిసిపోయింది.
ఈ చీర కోసం 15 మంది ప్రత్యేకంగా పనిచేశారట. ఈ చీర డిజైన్ చేయించుకునేందుకు నయన్ సుమారు రూ.25 లక్షల ఖర్చు చేసిందట. ముంబైలో ఈ చీరని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఆమె వజ్రాలు, పచ్చలతో కూడిన ఆభరణాలు ధరించింది. ఈ నగలన్నీ విఘ్నేష్ ఇచ్చినవేనట.
నయనతార నగలు విలువ రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి తన పెళ్లిలో నయనతార ధరించిన దుస్తులు, నగల ఖరీదు తెలుసుకుని కళ్లు తేలేస్తున్నారు నెటిజన్లు. కాగా, 2015లో వచ్చిన `నానున్ రౌడీదాన్` అనే సినిమాతో నయన్-విఘ్నేశ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…