Nazriya Nazim: నజ్రియా నజీమ్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2006లోనే సినీ గడప తొక్కిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన టాలెంట్‌తో మలయాళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన నజ్రియా.. `అంటే..సుందరానికీ!`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో న్యాచురల్ నాని హీరోగా నటించాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లోనే తెలుగుతో, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నజ్రియా సైతం ప్రమోషన్స్‌లో భాగమై వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఓ పెద్ద కోరిక బయట పెట్టింది. నజ్రియా మాట్లాడుతూ.. తెలుగు సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, చాలా రెగ్యులర్ గా తెలుగు సినిమాలను చూస్తానని చెప్పుకొచ్చింది.
అలాగే తెలుగుతో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన తాను ఎంతగానో ఇష్టపడతానని.. కుదిరితే వాళ్లతో సినిమాలు చేయాలనుందంటూ మనసులో కోరికను రివిల్ చేసింది. ఇక తమిళంలో అజిత్ లాంటి స్టార్స్ సరసన నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని పేర్కొంది. మరి నజ్రియా కోరిక నెరవేరుతుందో.. లేదో..చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!