Entertainment News సినిమా

`ఎన్‌బీకే 107`కు రిలీజ్ డేట్ లాక్‌.. బాల‌య్య వ‌చ్చేది ద‌స‌రాకు కాదు?!

Share

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దునియా విజయ్ విల‌న్ గా న‌టిస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. మ్యూజిక్ సెన్షేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

బాల‌య్య కెరీర్‌లో రూపొందుతున్న 107వ చిత్రం కావ‌డంతో.. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప‌ట్టాలెక్కించారు. ఇప్ప‌టికే అర‌వై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావించినా.. బాల‌య్య‌కు క‌రోనా రావ‌డంతో చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది.

ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకోవ‌డంతో.. మ‌ళ్లీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుందంటూ గ‌త కొద్ది రోజుల నుండీ ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే బాల‌య్య ద‌స‌రాకు రావ‌డం లేద‌ట‌. అప్ప‌టికి సినిమా పూర్తి అయ్యే అవకాశం లేదట.

అందుకే మేక‌ర్స్ `ఎన్‌బీకే 107` కోసం కొత్త రిలీజ్ డేట్ లాక్ చేశార‌ట‌. బాలయ్య చేసిన `అఖండ` చిత్రం డిసెంబర్ 2వ తేదీన విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే `ఎన్‌బీకే 107`ను కూడా డిసెంబ‌ర్ 2వ తేదీనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అఫీషియల్ గా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని సైతం ప్రకటించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇదే నిజ‌మై అఖండ సెంటిమెంట్ రిపీట్ అయితే.. బాల‌య్య‌కు మ‌రో హిట్ ఖాయ‌మ‌వుతుంది.


Share

Related posts

Pushpa: “పుష్ప” సక్సెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్న సుకుమార్, బన్నీ..!!

sekhar

Parvati Nair New Pictures

Gallery Desk

మ‌ల్లేశం… కొత్త వివాదం

Siva Prasad