Ante Sundaraniki: `శ్యామ్ సింగరాయ్` వంటి హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన తాజా చిత్రమే `అంటే.. సుందరానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. నరేశ్, హర్షవర్థన్, నదియా, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈచిత్రం జూన్ 10న విడుదలైంది.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం డల్‌గా ఉన్నాయి. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.87 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 5.82 కోట్ల షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద సుందరుడు ఊపందుకోవాలంటే కత్తెర వేయాల్సిందే అని అంటున్నారు సినీ ప్రియులు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలు విషయం ఏంటంటే.. ఈ మూవీకి రన్ పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు 3 గంటల నడివి ఉన్న ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను బాగా సాగదీయడంతో ప్రేక్షకుడిని బోరింగ్‌కి గురిచేశాయి. దీంతో లెంగ్త్ బాగా ఎక్కువైందని.. సినిమా చాలా స్లోగా నడిచిందనే నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే `అంటే..సుందరానికీ` కత్తెర వేసే మంచిదని.. అనవసరపు ఎపిసోడ్స్ ట్రిమ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేకుంటే రన్ టైమ్ ప్రభావం కలెక్షన్స్ పై తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా మేకర్స్ మేల్కొంటారా..లేదా.. అన్నది చూడాలి.