33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ప‌వ‌న్ చేతుల మీద‌గా `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` ట్రైల‌ర్‌!

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని`. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించాడు. ఇందులో సోను ఠాకూర్, సంజన ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి, బాబా భాస్కర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేతుల మీద‌గా `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` ట్రైల‌ర్ విడుద‌లైంది. `నాలాంటి చాలా మంది త‌ల్లిదండ్రులేమ‌నుకుంటారో తెలుసా..? కొడుకు క‌న్నా కూతురు పుడితేనే చాలా సంతోషంగా ఉంటామ‌ని` అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

`మగతనం అంటే మామూలుగా ఉన్న అమ్మాయితో మంచిగా ఉండడం కాదు.. తాగున్న అమ్మాయితో కూడా మిస్ బిహేవ్ చేయకుండా ఉండటం` అంటూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెప్పే డైలాగ్ బాగా అల‌రిస్తోంది. హీరోయిన్ కి ఎదురైన సమస్యని పరిష్కరించే యువకుడిగా కిరణ్ క‌నిపించ‌బోతున్నాడు. డీసెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.


Share

Related posts

Major: ఏడ్చేసిన “మేజర్” సినిమా డైరెక్టర్..!!

sekhar

Puri Musings: ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వదలొద్దు..

bharani jella

Malavika Mohanan: విజ‌య్ దేవ‌రకొండ‌తో రొమాన్స్ చేయాల‌నుంది..`మాస్ట‌ర్` బ్యూటీ!

kavya N