Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్‌ను ఈమె పెళ్లి చేసుకుంది. దాదాపు ఏడేళ్ల నుంచీ ప్రేమించుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్‌లు.. జూన్ 9వ తేదీన మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
కుటుంబసభ్యులు, సన్నిహితులే కాకుండా సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సైతం వీరి పెళ్లిలో సందడి చేశారు. వివాహం అనంతరం పలు పుణ్యక్షేత్రాలను దర్శించిన ఈ నూతన దంపతులు.. ప్రస్తుతం హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జోడీ థాయ్ లాండ్ ను తమ హనీమూన్ వేదికగా ఎంచుకుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. అయితే తాజాగా ఆయన భార్యతో దిగిన మరో రెండు పిక్స్‌ను అందరితోనూ పంచుకున్నారు. ఈ పిక్స్‌ను గమనిస్తే.. నయన్ మోడ్రన్ డ్రస్‌లో ఉన్నప్పటికీ మెడలో మంగళసూత్రం మాత్రం తీయలేదు.
ప్రజెంట్ జనరేషన్‌లో చాలా మంది మంగళసూత్రాన్ని తీసేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో వివాహమైన రెండో రోజే మంగళసూత్రాన్ని పక్కన పెట్టినవారు ఎందరో ఉన్నారు. కానీ, నయన్ మాత్రం సాంప్రదాయాన్ని మరువడం లేదు. మెడలో మంగళసూత్రం తీయడం లేదు. దీంతో నయన్ నిజంగా గ్రేట్ అని, ఈ విషయంలో ఆమె ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…