Entertainment News సినిమా

వైష్ణ‌వ్ తేజ్‌కి కొత్త టెన్ష‌న్‌.. చిన్న మామ‌నే కార‌ణ‌మా?

Share

యంగ్ హీరో, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉప్పెన‌` సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, తొలి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వేష్ణ‌వ్‌.. ఆ త‌ర్వాత `కొండపొలం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న వైష్ణ‌వ్ తేజ్‌.. `రంగ రంగ వైభవంగా` అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో `రొమాంటిక్` బ్యూటీ కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 2న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. అయితే రిలీజ్‌కు కొద్ది రోజులే ఉండ‌గా.. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌కు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అందుకు కార‌ణం ఆయ‌న చిన్న మామ ప‌వవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే. అస‌లు విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల పాత సినిమాల రీరిలీజ్‌ల హ‌డావుడి బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల బ‌ర్త్‌డే వ‌చ్చిందంటే.. వారి కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన చిత్రాల‌ను మ‌ళ్లీ విడుద‌ల చేస్తూ అభిమానులు సంభ‌రాలు చేసుకుంటున్నారు.

అయితే సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఆ రోజు `జల్సా` 4కె-డాల్మిఅట్మాస్ లో రీరిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా దాదాపు 500 కు పైగా స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు దృష్టి మొత్తం ఈ స్పెష‌ల్ షోల‌పై మ‌ల్లుతోంది. ఈ నేప‌థ్యంలోనే జల్సా రీ రిలీజ్ అయితే తని సినిమాకి మెగా అభిమానులు వ‌స్తారా..? అన్న అందోళ‌న వైష్ణ‌వ్‌కు మొద‌లైంద‌ని టాక్ న‌డుస్తోంది.


Share

Related posts

Charan: చరణ్ – ఉపాసనలో వున్న ప్రత్యేకత అదే!

Ram

బిగ్ బాస్ 4 : ” మళ్ళీ పెళ్లి చేసుకుంటా .. అతన్ని వదిలేయడం లో తప్పు లేదు ” దేవి నాగవల్లి !

sekhar

Pooja Hegde: నా కెరీర్‌లోనే అదో చెత్త సినిమా..దాని వ‌ల్లే ఆఫ‌ర్లు రాలేదు: పూజా హెగ్డే

kavya N