RC 15 Title: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రమే `ఆర్సీ 15`. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే రాజోలు సుందరి అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేన్స్ బ్యానర్‌పై ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రామ్ చరణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని గత ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తైంది. ఇకపోతే ఈ మూవీ టైటిల్ పై గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. మొదట ఈ మూవీకి `సర్కారోడు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత `అధికారి` టైటిల్ తెరపైకి వచ్చి వైరల్ అయింది. ఇప్పుడు మరో కొత్త టైటిల్ బయటకు వచ్చింది. అదే `సిటిజన్`. కథ పరంగా `సిటిజన్` టైటిల్ బాగా సెట్ అవుతుందని శంకర్ భావిస్తున్నారట. మరోవైపు ఈ టైటిల్ నెట్టింట ట్రెండ్ అవుతుండటంతో.. చరణ్ అభిమానులు `సర్కారోడు`, `అధికారి` టైటిల్స్ కంటే `సిటిజన్` టైటిల్‌నే అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి `సిటిజన్` టైటిల్ నే ఖరారు చేస్తారా..లేదా.. అన్నది చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!