21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

అంచ‌నాలు పెంచేసిన `ది ఘోస్ట్‌` కొత్త ట్రైల‌ర్.. నాగ్‌కు హిట్ ఖాయ‌మా?

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ దసరా పండుగ‌కు `ది ఘెస్ట్` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించినబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.

సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ మూవీ ఇది. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నాగార్జున సోద‌రిగా బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్ చేసింది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రింత హైప్ ను క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

the ghost movie
the ghost movie

వాస్త‌వానికి ఇప్ప‌టికే `ది ఘోస్ట్‌` థ్రియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌చ్చింది. అయితే మేక‌ర్స్ ఈసారి రిలీజ్ ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ కొత్త ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. `ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చి పిలిచావా అని అడుగుతావా?.. అవసరం కోసం పిలిచావా అని అడుగుతావా?` అంటూ గుల్ ప‌నాగ్ డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం అల‌రించింది.

`డబ్బు – సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది` అంటూ నాగ్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. యాక్ష‌న్ సీన్స్‌, విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ కొత్త ట్రైల‌ర్‌.. సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. పైగా ఈ ట్రైల‌ర్ ను చూసి నాగ్‌కు హిట్ ఖాయ‌మంటూ అభిమానులు, ప‌లు సినీ ప్రియులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి వారి అంచ‌నాను నాగ్ నిజం చేస్తాడో..లేదో.. చూడాలి.


Share

Related posts

HBD Anchor Anasuya: జబర్దస్త్ బ్యూటీ బర్త్ డే సిడిపిలు మామూలుగా లేవుగా..!!

bharani jella

ఒక‌టి కాదు… రెండు దెయ్యాలు!

Siva Prasad

ప్రేమికుల రోజు రానున్న ‘దేవ్’

Siva Prasad