మెగా డాటర్ నిహారిక కొణిదెల తల్లి కాబోతోందట. త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడట. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైన హీరోయిన్ నిహారిక. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..`ఒక మనసు` మూవీతో హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించింది.
ఆ తర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు చేసింది. అలాగే పెదనాన్న చిరంజీవి 151వ చిత్రమైన `సైరా నరసింహారెడ్డి`లో ఓ చిన్న పాత్రను పోషించింది. కానీ, ఇవేమి ఈమె కెరీర్‌ను ప్లాస్ అవ్వలేదు. దాంతో ఈ అమ్మడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో 2020, డిసెంబర్ 9న ఏడడుగులు నడిచింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.
ఉదయ్ పూర్లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత నటనకు దూరమై నిర్మాతగా మారిన నిహారిక.. వరుస వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ సత్తా చాటుతోంది. త్వరలోనే ఈమె నిర్మించిన `హలో వరల్డ్` ఓటీటీలో విడుదల కాబోతోంది.
అయితే ఇలాంటి తరుణంలో నిహారిక గర్భం దాల్చిందని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. పైగా ‘మా లైఫ్ లోకి మరొకరు.. ఇకపై మేం ముగ్గురం’ అంటూ నిహారిక సోషల్ మీడియాలో వెల్లడించిందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఎక్కడా అలాంటి అలాంటి పోస్ట్‌లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో నిహారిక ప్రెగ్నెన్సీ నిజమా..? లేక పుకారేనా..? అన్నది తేలడం లేదు. మరి ఆమె ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!