NewOrbit
Entertainment News సినిమా

తుది ద‌శ‌కు నిఖిల్ `18 పేజెస్‌`.. ఇదిగో రిలీజ్ డేట్‌!

Share

ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నిఖిల్.. ప్రస్తుతం `18 పేజెస్` అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలనాటి సూర్య ప్రతాప్ ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

Advertisements
Nikhil 18 pages movie update
Nikhil 18 pages movie update

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా `18 పేజెస్‌` చివరి షెడ్యూల్ ప్రారంభం అయింది. నిఖిల్ సైతం షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో నిఖిల్ మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది. `కార్తికేయ 2` త‌ర్వాత నిఖిల్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

 


Share

Related posts

డ్రీమ్ ప్రాజెక్ట్ పైనే పూరి ఆశ‌లు.. ఈసారి మిస్ అయితే ఇక అంతే!?

kavya N

Vakeel Saab : “వకీల్ సాబ్” సినిమాలో డైరెక్టర్ కి ఇష్టమైన సీన్..!!

sekhar

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో నాగ‌శౌర్య‌

Siva Prasad