టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ త్వరలోనే `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు సీక్వెల్‌గా ఈ మూవీ వస్తోంది. మొండేటి చందు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిఖిల్ తాజాగా మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. `జూలై 22 నుండి మా సినిమాను పోస్ట్‌పోన్ చేయిస్తూనే ఉన్నారు. కేవలం మా సినిమానే వాయిదా వేసుకోమనడం ఏంటి? మా సినిమాకు, మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టే ఇలా జరుగుతోంది. సరే అని పోస్‌పోన్ చేసి నెక్స్ట్ పాజిబుల్ డేట్ ఆగస్టు 12ను పెట్టుకున్నాం. కానీ, ఆ తేదీకి కూడా థియేటర్స్ ఇవ్వము. అక్టోబర్‌లో చేసుకోండని అన్నారు. చాలా బాధపడ్డాను, జీవితంలో తొలిసారి ఏడ్చాను.` అంటూ నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిర్మాతలు బలంగా నిలబడటం వల్లే ఆగస్టు 12న సినిమాను విడుదల చేయగలుగుతున్నామని.. ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని నిఖిల్ చెప్పుకొచ్చారు. కాగా, జూలైలో `థ్యాంక్యూ`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాల కారణంగా `కార్తికేయ 2`ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఆగస్టు 5న నందమూరి కళ్యాణ్ రామ్ `బింబిసార`, ఆగస్టు 12న నితిన్ `మాచర్ల నియోజకవర్గం` సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఖిల్ సినిమాను వాయిదా వేయాలని చెప్పారట. కానీ, నిఖిల్ వెనక్కి తగ్గకపోవడంతో..థియేటర్స్ ఇవ్వమని బెదిరించినట్లు ఆయన తాజా వ్యాఖ్యలే స్పష్టం చేశాయి.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…