NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

Nikhil Siddhartha: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ ఒక‌రు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్‌.. ఆ త‌ర్వాత హీరోగా నిల‌దొక్కుకున్నాడు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2022లో కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. నిఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2020 మే 14న డాక్ట‌ర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. పెద్ద‌ల అంగీకారంతో ఏడ‌డుగులు వేశారు.

వివాహమైన మూడేళ్ల‌కు ఈ దంప‌తులు త‌మ ఫ‌స్ట్ చైల్డ్ కు వెల్క‌మ్ చెప్పారు. గ‌త ఏడాది ప్రెగ్నెంట్ అయిన ప‌ల్ల‌వి వ‌ర్మ‌.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌న‌కు కొడుకు పుట్టాడంటూ నిఖిల్ సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. కొద్ది రోజుల క్రితం నిఖిల్ త‌న‌యుడి బార‌సాల వేడుక కూడా ఘ‌నంగా జ‌రిగింది. అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న నిఖిల్‌.. ఫ‌స్ట్ టైమ్ త‌న కుమారిడి పేరును రివీల్ చేశాడు. అలాగే తండ్రి అయ్యాక త‌న‌లో వ‌చ్చిన మార్పును కూడా వివ‌రించాడు.

నిఖిల్ త‌న‌యుడి పేరు ధీర సిద్ధార్త్‌. తండ్రి అయిన త‌ర్వాత నిఖిల్ ఎక్కువ స‌మ‌యం బాబుతోనే గ‌డుపుతున్నాడు. తండ్రిగా బాబు బాధ్యతను పంచుకుంటున్నాడు. అలాగే ధీర పుట్టక ముందు వ‌ర‌కు నిఖిల్ క‌చ్చితంగా వారానికి ఒక రోజు పార్టీకి వెళ్లేవాడ‌ట‌. చాలా ఏళ్ల నుంచి ఇది ఆయ‌న‌కొక అల‌వాటుగా ఉంది. కానీ ఎప్పుడైతే బాబు ఇంటికి వ‌చ్చాడో.. అప్ప‌టి నుంచి నిఖిల్ ఆ అల‌వాటును వ‌దిలేశాడ‌ట‌. షూటింగ్స్ లేన‌ప్పుడు త‌న పూర్తి స‌మ‌యాన్ని భార్య‌, కొడుకు కోస‌మే కేటాయిస్తున్నాడ‌ట‌. తాజాగా నిఖిల్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

తల్లిదండ్రులు అయ్యాక పిల్లల కోసం కొన్నిటిని వదులుకోవాలి. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచడానికి ఎల్ల‌ప్పుడూ కృషి చేయాలి. ప్ర‌స్తుతం నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. 15 ఏళ్ల క్రితం జీవితం ఇంత సంతోష‌కరంగా ఉంటుందని ఎవరైనా చెబితే నేను ఆందోళన చెందేవాడిని కాదంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం నిఖిల్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.

అందులో స్వయంభు ఒక‌టి. భరత్ కృష్ణమాచారి ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఒక యుద్ద వీరుడిగా క‌నిపించ‌బోతున్నాడు. అత‌నికి జోడీగా సంయుక్త మీన‌న్‌, న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు. పీరియాడిక‌ల్‌ యాక్ష‌న్ డ్రామాగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న స్వ‌యంభు ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. అలాగే గ్లోబ‌ర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. అదే ది ఇండియా హౌస్. వీర్ సావర్కర్ 140వ జయంతి నాడు ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇక మ‌రోవైపు కార్తికేయ 3 మూవీకి కూడా నిఖిల్ క‌మిటై ఉన్నాడు.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju