NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

Nindu Noorella Saavasam 2024 Episode 227:  మిస్సమ్మ లోపలి ఏం జరిగింది అని మనోహరి అడుగుతుంది. ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావ్ ఏంటి మనోహరి అని మిస్సమ్మ సిగ్గుపడుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అమర్ నీ వంక కూడా చూడడు అని మనోహరి అంటుంది. పైకి ఆయన అంత కోపంగా కనిపిస్తాడు కానీ నేను లోపలికి వెళ్ళగానే నన్ను చూసి ఆయన సిగ్గుపడి నాతో కబుర్లు పెట్టాడు ఆ తర్వాత ముద్దులు ముచ్చట్లు అబ్బో  అయినా అవన్నీ నీకెలా తెలుస్తాయి లే నీకు పెళ్లి కాలేదు కదా అని భాగమతి అంటుంది. నువ్వు నటిస్తున్నావ్ అమర్ అలాంటి వాడు కాదు తనేంటో నాకు తెలుసు అని మనోహరి అంటుంది. పెళ్లి కాక ముందు అందరూ అలాగే ఉంటారు పెళ్లయ్యాక అందరూ భార్యాదాసులే అని భాగమతి అంటుంది. మనోహరి కంగారుపడుతూ గదిలోకి వెళ్లి చూడగానే ఏమి జరగనట్టు తెలుస్తుంది ఇది నన్ను ఉడికించడానికి అలా ప్రవర్తించి ఉంటుంది అని మనోహరి అనుకుంటుంది. ఏంటి మనోహరి ఇలా వచ్చావు అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights
Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

ఏమీ లేదు అమర్ కాఫీ తాగుతావా ని అడుగుదామని వచ్చాను అని మనోహరి అంటుంది. కొత్తగా అడుగుతావేంటి తీసుకురా అని అమరేంద్ర అంటాడు. నీలా తో పంపిస్తా అని మనోహరి బయటికి వెళుతుంది. ఏంటి భయపడి పోయావా అని భాగమతి అంటుంది. మనోహరి కోపంగా కిందికి వెళుతుంది. అమరేంద్ర అరుంధతి నిలబడ్డ కిటికీ వంక నిలబడి తలవంచుకుంటాడు. అరుంధతి అమరేంద్రని ముట్టుకొని బాధపడుతుంది. ఏడు జన్మలకి మీరే నా భర్త కావాలి అనుకున్నాను కానీ ఈ జన్మలో చివరి వరకు ఉండలేకపోయాను వచ్చే జన్మలో ఆయన భగవంతుడితో కొట్లాడి నూరేళ్లు ఆయుష్ తెచ్చుకొని మీతో జీవితాన్ని గడుపుతాను ఈరోజుతో అరుంధతి అమరేంద్ర కథ సమాప్తం వెళ్ళొస్తాను అని అరుంధతి అంటుంది. అమరేంద్ర తల పైకెత్తి అరుంధతి వంక చూస్తాడు. అమరేంద్రని చూసి తట్టుకోలేని అరుంధతి కిందికి పరిగెత్తుకెళ్తుంది. కట్ చేస్తే, అరుంధతిని చూసిన భాగమతి అక్క నువ్వెప్పుడొచ్చావ్ నిన్నటి నుంచి కనిపించనే లేదు అని అంటుంది. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను నీ పెళ్లి జరిగింది కదా అని అరుంధతి అంటుంది. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అక్క కావాలని చేసుకోలేదు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights
Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

ఎవరికి ఎంతవరకు రాసి పెట్టాడో ఆ భగవంతుడికి తెలుసు మిస్సమ్మ మీ ఇద్దరికీ రాసి పెట్టింది కాబట్టి పెళ్లి జరిగింది అని అరుంధతి అంటుంది. అరుంధతి భాగమతి తో మాట్లాడుతూ ఉండగా బాలిక టైం అవుతుంది రా అని గుప్తా అంటాడు. వెళ్ళొస్తాను మిస్సమ్మ అని అరుంధతి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అక్క అని భాగమతి అడుగుతుంది. ఇకనుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని అరుంధతి అంటుంది. మళ్లీ ఎప్పుడు వస్తావు అక్క అని భాగమతి అడుగుతుంది. ఇకనుంచి చాలా దూరం వెళుతున్నాను మిస్సమ్మ మళ్ళీ తిరిగి వస్తాను లేదో తెలియదు అని అరుంధతి బాధపడుతుంది. ఏంటో అక్క అప్పుడప్పుడు నువ్వు అన్నా ఉంటావని ధైర్యంగా ఉండేది నువ్వు కూడా వెళ్ళిపోతున్నావ్ అని భాగమతి అంటుంది. పిల్లలు ఈ కుటుంబం జాగ్రత్త బాగా చూసుకో అని అరుంధతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బాలిక మనం వెళ్ళుటకు సమయం అయినది అని గుప్తా అంటాడు. అరుంధతి గుప్తా కి నమస్కారం పెట్టి కింద మోకరిల్లుతుంది. గుప్తా గారు ధూమ్ తత అనగానే పైకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, రామ్మూర్తి తన పెద్ద కూతురు దూరమైపోతుంది అని లేచి బాధపడతాడు.

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights
Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

ఇప్పుడు నీ పెద్ద కూతురు దూరమవడం ఏంటయ్యా చిన్నప్పుడే పోగొట్టుకున్నావు కదా అని మంగళ అంటుంది. ఇన్నాళ్లు తను ఎక్కడ ఉన్నా నా మాట తనకు వినిపించేది తను నాకు ఏదో చెప్తున్నట్టు అనిపించేది కానీ నా కూతురు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని రామ్మూర్తి అంటాడు.కొంపదీసి ఈయన పెద్ద కూతురు గురించి ఆలోచించి తెలుసుకుంటాడా ఏంటి మ్యాటర్ డైవర్ట్ చేయాలి అని భాగికి పెళ్లయిన కానించి మీకు పిచ్చెక్కినట్టుంది ఏదేదో మాట్లాడుతున్నారు అని మంగళ అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఆ ఇంటికి మనం వెళ్ళాలి పదా అని రామ్మూర్తి అంటాడు. ఎందుకు అని మంగళ అంటుంది. ఎందుకంటే వెంటే అబ్బాయిని అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి అని రామ్మూర్తి అంటాడు. నీ కూతుర్ని శాస్త్రబద్ధంగా పెళ్లి చేసి పంపించావా వెళ్లి తీసుకురావడానికి నిన్ను చూస్తేనే మండిపడతాడు ఏం అవసరం లేదు  అని మంగళ అంటుంది. ఆయనని ఒప్పించు బ్రతిమిలాడో ఇక్కడికి తీసుకురావాలి పదా అని రామ్మూర్తి అంటాడు. వెళ్లకపోతే ఈయనతో బాధ వెళ్తే మనోహరితో బాధ ఏం చేయాలి అని మంగళ ఆలోచిస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights
Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

కట్ చేస్తే, మిస్సమ్మ అమరేంద్ర టిఫిన్ తిన్నాక కాఫీ తాగడం అలవాటు వెళ్లి తీసుకురా అని నిర్మల చెబుతుంది. ఆంటీ నీలా తో పంపించాను అని భాగమతి చెబుతుంది. నీలాతో పంపించడ మేంటమ్మా నువ్వే వెళ్లి అమరేంద్ర కి రోజు కాపీ ఇవ్వాలి ఇంకా ఆంటీ ఏంటి అత్తయ్య అని పిలు అని నిర్మల అంటుంది. అక్కడే మనోహర్ని చూసినా భాగమతి అలాగే అత్తయ్య మిమ్మల్ని తృప్తిగా అత్తయ్య అని పిలుస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది అలాగే పిలుస్తాను నిన్ను అత్తయ్య అంటాను అంకుల్ని మామయ్య అంటాను అని భాగమతి వెనుకకు తిరిగేసరికి అమరేంద్ర అక్కడ ఉంటాడు. అమర్ నేనే అత్తయ్య అని పిలవమని బలవంతం చేశాను అని నిర్మల అంటుంది. రాథోడ్ ఏం చేస్తున్నావ్ ఇలా రా బయలుదేరాలి అని అమరేంద్ర అంటాడు.ఎక్కడికి వెళ్తున్నావ్ అమర్ అని నిర్మల అడుగుతుంది. ఆఫీస్ కి వెళ్తున్నాం అమ్మ అని అమరేంద్ర అంటాడు. పెళ్లయి 24 గంటలు కూడా కావడం లేదు అప్పుడే ఆఫీస్ కి వెళ్ళడమేంట్రా అని నిర్మల అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights
Nindu Noorella Saavasam Today Episode  2024 Episode 227 highlights

ఇంట్లో ఉండి మనసు పాడు చేసుకోవడం ఇష్టం లేక వెళుతున్నాడేమో ఆంటీ అని మనోహరి అంటుంది. ఇష్టం లేని వాళ్ళని చూస్తూ ఇక్కడ ఉండలేను అందుకే ఆఫీస్ కి వెళ్తున్నాను అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. మిస్సమ్మ నువ్విలా రా అని నిర్మల అమరేంద్రని ఆగమని అంటుంది. ఎందుకమ్మా అని అమరేంద్ర అంటాడు. పెళ్లయిన మొదటిసారి ఆఫీస్ కి వెళ్తున్నావ్ మిస్సమ్మ ఎదురొస్తుంది వెళ్ళు మీస్సమ్మ ఎదురు రా అని నిర్మల అంటుంది. నేనా అని భాగమతి భయపడుతుంది. పర్వాలేదు మీస్సమ్మ వెళ్ళు అని నిర్మల బలవంతం చేయడంతో భాగమతి వెళ్లి అమరేంద్ర గారికి ఎదురు వచ్చి బాయ్ చెబుతుంది. కారు ముందుకు వెళ్ళగానే భాగమతి తనని కొట్టినట్టు చేతులతో అంటుంది. అద్దంలో నుంచి చూసిన అమరేంద్ర డోర్ ని కొడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella