NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221:బాగి ఎలా ఉన్నావ్ అమ్మ అని రామ్మూర్తి అంటాడు. నువ్వేంటే కరుణ ఎలా వచ్చావు అని భాగమతి అడుగుతుంది. నేను కాదే నువ్వేంటి ఇలా ఉన్నావు అని కరుణ అడుగుతుంది. నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని భాగమతి అంటుంది. ఎవరో పెళ్లి ఆపడానికి వెళ్ళావంట అని కరుణ అంటుంది. అవును నాన్నగారు మనోహరి కి ఆయనకి పెళ్లి జరిగిపోయిందా? ఆ పెళ్లి ఆపాలని చివరి వరకు ప్రయత్నించాను కానీ ఆపలేకపోయాను అని భాగమతి అంటుంది. ఏం చేస్తాం అమ్మ జరిగిందా నీ గురించి ఇంకా ఆలోచిస్తే ఏం లాభం అని రామ్మూర్తి అంటాడు. ఆ పిల్లలకి పెళ్లి ఆపుతానని ప్రామిస్ చేశాను కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను అని భాగమతి బాధపడుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావ్ భాగీ నీకేమైనా అర్థమవుతుందా అని మంగళ అంటుంది. మీరేం మాట్లాడుతున్నారు నాకు కూడా అర్థం కావట్లేదు అని భాగమతి అంటుంది. నువ్వు పెళ్లాపడానికి పోలేదే పెళ్లి చేసుకున్నావు అని కరుణ అంటుంది. నేను పెళ్లి చేసుకోవడమేంటే మనోహరి పెళ్లి ఆపడానికి వెళ్లాను అని భాగమతి అంటుంది. నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అని కరుణ అంటుంది.’

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights
Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

భాగీ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా పెళ్లి కానీ వెళ్లిన దానివి తాళికట్టించుకొని కనపడ్డావు ఆ అ మిల్ట్రీ ఆయన నీ మెడలో తాళి కట్టాడు అని మంగళ అంటుంది. పిన్ని నువ్వేం  మాట్లాడుతున్నావా ఆ మిల్ట్రీ ఆయనతో నేను తాళి ఎందుకు కట్టించుకుంటాను అని భాగమతి అంటుంది.ఏం జరిగిందేమో మాకు తెలియదు కానీ నిజంగానే నీకు పెళ్లయిపోయిందమ్మ ఆ అమరేంద్ర ని మెడలో తాళి కట్టేశాడు అని రామ్మూర్తి అంటాడు. ఏంటి అని భాగమతి అంటుంది. నువ్వు పెళ్లాపడానికి పోతే నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందో చూసుకోవే అని కరుణ అంటుంది. భాగమతి మెడలో ఉన్న తాళిని చూసి షాక్ పోతుంది. తాళి కాదే తాలే కట్టించుకున్నవు మిల్ట్రీ ఆయనే కట్టాడు ఇప్పుడు అర్థమైందా అని కరుణ అంటుంది.అసలు నేను అక్కడికి ఎలా వెళ్లానో నాకు పెళ్లి ఎలా జరిగింది ఈ తాళి మెడలోకి ఎలా వచ్చింది అని భాగమతి స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే, గుప్తా గారు అప్పుడేమో వెళదాము వెళ్దాము అన్నారు నేను రాను  అన్నాను ఇప్పుడు వెళ్దామంటే రాను ఇక్కడే ఉంటానంటున్నాడు ఏం చేయాలి అని అనుకుంటుంది అరుంధతి. గుప్తా గారు ఏం జరుగుతుందంటారు ఇంకా మా ఆయన రాలేదు అని అరుంధతి అంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి ఎరుగునట్టు మాట్లాడుతుంటివా అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights
Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

ఇదేంటి గుప్తా గారు మా ఆయనకి పెళ్లి అవుతుందని విత్తనం నాటిన పంతులుగారు మళ్లీ ఇంటికి వస్తున్నారు  అని భాగమతి అంటుంది. మళ్లీ ఏ విత్తనం నాటడానికి వస్తున్నాడు అని గుప్తా అంటాడు. అయితే మన రెగ్యులర్ స్పాట్ కి వెళ్లి చూద్దామా అని భాగమతి అంటుంది. పద ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావ్ అని గుప్తా అంటాడు. కట్ చేస్తే, ఏంటమ్మా మీ అబ్బాయి పెళ్లి బాగా జరిగిందా ఎందుకు నన్ను రమ్మని కబురు పెట్టారు అని పంతులుగారు అంటారు. పంతులుగారు మీరేమో అరుంధతి లాంటి కోడలు మా ఇంటికి వస్తుందన్నారు కానీ మిస్సమ్మ స్పృహ కోల్పోయింది ఇంటికి కూడా రాలేదు అమర్ అసలు తనని ఇంటికి తీసుకువస్తాడో లేదో కూడా తెలియదు అని నిర్మల అడుగుతుంది. అమ్మ ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరి పెళ్లి జరగడం దైవ నిర్ణయం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటారు పెళ్లి ఎలాగూ అయిపోయింది కాబట్టి ఈరోజు సాయంత్రం ఏడు గంటల లోపు వాళ్ళిద్దరు ఇంటికి తీసుకువచ్చి కొత్త కోడలు చేత దీపం వెలిగించండి లేదంటే కీడు వస్తుంది అని పంతులుగారు అంటారు.

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights
Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

అసలు మిస్సమ్మని ఇంటిదాకా రాణిస్తాడో లేదో ఇంట్లో దీపం ఎలా పెడతారు అండి ఇంకా అమర్ ఇంటికి కూడా రాలేదు అని శివరామ్ అంటాడు.జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ పంతులుగారు వెళ్ళిపోతారు. ఇదేంటండి పంతులుగారు ఏదో ఒక పరిష్కారం చెప్తారు అనుకుంటే కీడు అని భయపెడుతున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అని నిర్మల అంటుంది. ఏముంది సాయంత్రంలోగా వాళ్ళిద్దరిని ఒప్పించి ఇక్కడికి తీసుకురావడమే మంచి పని నేను భాగమతి దగ్గరికి వెళ్తాను నువ్వు అమర్ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి తీసుకురా అని శివరామ్ వెళ్ళిపోతాడు. అమరేంద్ర ఎక్కడున్నాడో రాథోడ్ కి ఫోన్ చేసి కనుక్కోవాలి అని నిర్మల అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights
Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

చూసావా నువ్వు చేసిన పనికి ఆ పెద్ద వాళ్ళిద్దరూ ఎంత తిప్పలు పడుతున్నారో అని గుప్తా అంటాడు. కట్ చేస్తే,డాక్టర్ గారు అమ్మాయి స్పృహలోకి వచ్చిందా అని అడుగుతారు. వచ్చింది వెళ్లి చూడండి అని డాక్టర్ గారు చెప్పడంతో ముగ్గురు లోపలికి వెళ్తారు. భాగమతి కళ్ళు మూసుకొని ఒక చెయ్యి తెరచి తాళిబొట్టును చూసుకుంటుంది. ఏ బాగి ఈసారి స్పృహ లేకుండా పడిపోతే మాత్రం బాగోదు ఎన్నిసార్లు పడిపోతావే అని మంగళ అంటుంది. చూసుకున్నావా తాళిబొట్టు అది నీ మెడలోకి ఎలా వచ్చింది అని కరుణ అంటుంది. ఇంటి దగ్గర ఉన్న నన్ను హాస్పిటల్ లో పడేసి తాళిబొట్టుతో చూపించి ఎలా వచ్చిందని అడుగుతున్నారా అని భాగమతి అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights
Nindu Noorella Saavasam Today Episode April 26 2024 Episode 221 highlights

నీకు మత్తుమందు ఇచ్చి నీ పెళ్లి చేసి బెడ్ మీద పడుకోబెట్టమనుకుంటున్నావా నువ్వే కావాలని పెళ్లి ఆపుతానని వెళ్లి తాళికట్టించుకున్నావు అని మంగళ అంటుంది. నిజంగా దీనికి పిచ్చి పట్టింది అంకుల్ అని కరుణ అంటుంది.నాకు అదే పిచ్చి పట్టింది మీకే పిచ్చి పట్టింది అని భాగమతి అంటుంది.అసలేం జరిగిందో చెప్తాను విను అని కరుణ జరిగిన విషయంఅంతా చెబుతుంది. నాకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని భాగమతి అంటుంది. మనోహరి పెళ్లి చూడ్డానికి వెళ్లి మనోహర్ని సైడ్ చేసి అమర్ తో పెళ్లి చేసుకుని ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా భలే నటిస్తున్నావే అని మంగళ అనుకుంటుంది.భాగీ నీకెందుకు గుర్తులేదు ఏమో నాకు తెలియదు కానీ నిజంగానే అమరేంద్ర తో నీకు పెళ్లి జరిగింది అని రామ్మూర్తి అంటాడు. ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా భాగమతి బెడ్ నుంచి మాయమైపోతుంది. బాగి ఏది అని మంగళ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella