NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Nindu Noorella Saavasam April 8 2024 Episode 205: అంజలి ఒంట్లో ప్రవేశించిన అరుంధతి, మనోహర్ని ఆపాలంటున్న భాగమతి..

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

Nindu Noorella Saavasam April 8 2024 Episode 205:  ఈ బాలిక ఇచ్చట లేదు ఉంగరము వెతుకుదాము అని గుప్తా ఉంగరం వెతుకుతాడు. ఉంగరము తనకు దొరుకుతుంది. గుప్తా గారు ఎక్కడ మాయమైపోయారు అంటూ అరుంధతి వెతుకుతూ ఉండగా తన ముందు ప్రత్యక్షమవుతాడు. బాలిక ఇక నీ ఆటలు సాగవు మా లోకమునకు పోదాము రమ్మని గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారు అని అరుంధతి అంటుంది. బాలిక నాలో ఏమి తేడా కనిపించడం లేదా అని గుప్తా అంటాడు. ఏమీ కనిపించడం లేదు గుప్తా గారు అని అరుంధతి అనడంతో సరిగ్గా చూడుము బాలిక అని ఉంగరమును చూపెడతాడు గుప్తా. గుప్తా  గారు నన్ను క్షమించండి మీ లోకానికి తీసుకుపోకండి ఈ ఒక్కరోజు ఆగండి అని అరుంధతి గుప్తా కాళ్ళ మీద పడుతుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా గుప్తా గారు తనని తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి అంజలి వస్తుంది. అంజలి ఒంట్లోకి దూరిపోతుంది అరుంధతి. ఏమి జరిగినది అని గుప్తా చూసేసరికి పరిగెత్తుతుంది అంజలి.

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights
Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

బాలిక ఆగము నిను చెప్పేది వినుము నువ్వు చేసేది సృష్టికి విరుద్ధము అని గుప్తా అంటాడు. గుప్తా గారు మా ఆయనకి మనోహరి కి పెళ్లి జరగకుండా ఆపడానికి ఉండనివ్వకుండా తీసుకువెళ్తారా నా పిల్లల్నినా నుండి దూరం చేయాలనుకుంటారా అని అంజలి అంటుంది.అంజలి చిన్న పిల్ల తనకు పిల్లలు ఎక్కడున్నారు అని ముగ్గురు పిల్లలు షాక్ అవుతారు. ఏ అంజు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ గుప్తా గారిని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావ్ అనిపిల్లలు అంటారు.ఇదొక కొత్త ఆట అమ్ములు రా ఆడుకుందాం అని అంజలి పరిగెత్తుతుంది. జగన్నాథ ఈ పిల్ల పిచ్చుక ఒంట్లో అరుంధతి దూరి నన్ను ఇబ్బంది పెడుతున్నది ఈ బాలికతో ఇంక నేను ఎన్నాళ్ళు ఎగాలి ఈ బాలికను మన లోకమునకు ఎప్పుడు తీసుకువెళ్లాలి అనిగుప్తా గారు తల పట్టుకుంటారు.కట్ చేస్తే,అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అని కంగారుపడుతూ ఉంటుంది నీలా. ఇంతలో మనోహరి ఇంటికి వచ్చి తన ఫోన్ వెతుక్కుంటూ ఉంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights
Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

అమ్మగారు మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. నీతో మాట్లాడే టైం ఓపిక నాకు లేదు ఫోన్ మర్చిపోయాను బంగారం ఇచ్చిన సెట్ ఫోన్ చేశాడేమో అని చూడగానే చాలాసార్లు ఫోన్ చేస్తాడు సెట్. తనని ఇంటికి రావద్దు ని ఫోన్ చేయాలి అని మనోహరి అంటుంది. ఇంటికి రాకుండా ఫోన్ చేయడం ఏంటమ్మా వచ్చాడు అతను అమరేంద్రయ్య గారు కలిశాడు అని నీలా చెబుతుంది. ఏంటి అమరేంద్ర అతన్ని కలిశాడా ఏమన్నాడు అని మనోహరి కంగారుగా అడుగుతుంది. అమరేంద్రయ్య నీకు ఆ నగలు ఇద్దామని బయలుదేరాడు అని నీలా చెప్పడంతో మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, భాగమతి రాథోడ్ ఆ నగల షాప్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి మనోహరి గారు నగలు ఇచ్చారు కదా ఏం చేశారు అని అడుగుతారు. ఆవిడ నగల్ ఆ నగల కి బదులుగా డూప్లికేట్ నగర్ చేయమన్నారు అని ఆ షాప్ లో ఉన్న అబ్బాయి చెప్పగానే అంటే మనోహరి నగలు కరిగించడం లేదు వాటిని ఎవరికో ఇయ్యాలని చూస్తుంది తనని ఆపాలి అని భాగమతి అంటుంది. అక్కడినుంచి రాథోడ్ భాగమతి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మనోహరి వెళ్తూ ఉండగా ఆ డ్రైవర్ తన గారికి అడ్డంగా పడుకుంటాడు. ఎవడ్రా నువ్వు చావడానికి నా నా కార్ కి దొరికిందా అని మనోహరి అంటూ ఉండగా ఆ రౌడీని

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights
Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

చూస్తుంది.నమస్తేమేడం మీరు పెళ్లికి సిద్ధమయ్యారు కానీ నన్ను మర్చిపోయారు నాకు ఇస్తానన్న నగలేవి లేదంటే అమరేంద్ర కి నిజం చెప్పేస్తాను అని ఆ డ్రైవర్ అంటాడు. ఆ నగలు అమరేంద్ర దగ్గర ఉన్నాయి వెళ్లి తెచ్చి నీకే ఇస్తాను అటు తప్పుకో అంటుంది మనోహరి. ఇలాగే నన్ను మభ్యపెడుతున్నారు రేపే మేడం మీ పెళ్లి ఈలోగా నాకు నగలు అందకపోతే మీ పెళ్లి ఆపేస్తాను అని ఆ రౌడీ అనడంతో నీకు నగలు కావాలి అంతే కదా గంటలో నీకు ఇస్తాను అని మనోహరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అమరేంద్ర జీబ్ ను చూసి ఆగి పరుగెత్తుకొచ్చి కంగారుగా పడుతూ జీబ్ లో నగలు ఉన్నాయేమో అనిమనోహరి చూస్తుంది.ఏమైంది మనోహరి ఎందుకు అంతకంగారు పడుతున్నావ్ ఏమైనా తప్పు జరిగిందా అని అమరేంద్ర అడుగుతాడు. అది కాదా మర్ సేట్ నీకు నగలు ఇచ్చాడంట కదా అవి ఆరు నగలు నీ భార్య స్థానంలో ఉండి నేను మొట్టమొదటి బాధ్యత తీసుకున్నాను అవి ఎక్కడ చేయి జారిపోతాయో అని భయం అంతే అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights
Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

భయపడకు మనోహరి అవి నీకు ఇవ్వమని మిస్సమ్మకి ఇచ్చాను తన దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ దగ్గర నగలు ఉన్నాయి అంటే ఏదో చేస్తుంది అని టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది మనోహరి. కట్ చేస్తే, ఏమైందమ్మా అంత కంగారుగా ఉన్నావ్ అని రామ్మూర్తి అడుగుతాడు. ఏమీ లేదు అంకుల్ మిస్సమ్మ వచ్చిందా అని మనోహరి అడుగుతుంది. వచ్చిందమ్మా నీకేదో బ్యాగ్ కూడా ఇవ్వమని ఇచ్చింది అని రామ్మూర్తి చెబుతాడు. మనోహరి వెళ్లి ఆ నగలు చూసేసరికి నగలు అలాగే ఉంటాయి. నగలు ఉన్నాయి అంటే బాగి ఈ నగలు చూడలేదన్నమాట అని మనోహరి అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights
Nindu Noorella Saavasam Today Episode April 8  2024 Episode 205 highlights

మనోహరి ఆ రౌడీ కి ఫోన్ చేసి నగలు తీసుకు వెళ్ళమని చెబుతుంది. నీ కారు వెనకాలే ఉన్నాను మేడం అని ఆ డ్రైవర్ అంటాడు. ఆ నగల్ని తన చేతిలో పెట్టి అ మర్ కీ కనిపించనంత దూరం పారిపో అని చెబుతుంది మనోహరి. మేడం ఇన్ని నగలు నా చేతికి వచ్చాక ఇంకా ఇక్కడే ఉండి జైల్లో ఎందుకు పడాలి అనుకుంటాను ఇవి కొంపతీసి డూప్లికేట్నగల అని ఆ డ్రైవర్ అంటాడు. రేయ్ నీలాగా కక్కుర్తి పడేదాన్ని కాదు ఆస్తి అంత నా చేతికి వస్తుందనే కాదురా నా సంతోషం అమర్ తో నా పెళ్లి జరగాలి అదే నాకు ముఖ్యం అని మనోహరి అంటుంది. ఆల్ ద బెస్ట్ మేడం అంటూ అతను వెళ్ళిపోతాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella