NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 21 2023 Episode 86: అరుంధతి గురించి తెలుసుకొని ఫోటో తీస్కొని పారిపోయిన భాగామతి వాళ్ళ పిన్ని…

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Share

Nindu Noorella Saavasam November 21 2023 Episode 86:  కళ్ళు మంట తగ్గకుటే రాథోడ్ని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని చెప్పు అని అమరేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఆయన చెప్పిందే వినాలి ఇవతల వాళ్ళు చెప్పేది ఏమీ పట్టించుకోడు అని భాగమతి అనుకుంటుంది. ఈ రాథోడ్ ఒకడు నీళ్ళు అని వెళ్లి అటే వెళ్ళాడు నీళ్లు కొనుక్కొస్తున్నాడా బావిలో నుంచి తోడుతున్నాడా ఇంతసేపు వెళ్ళాడు అని అనుకుంటుంది భాగమతి. కట్ చేస్తే, 20 ఏళ్ల క్రితం ఒక ముసలావిడ ఒక ఆడబిడ్డని తీసుకువచ్చి ఈ హాస్టల్ ముందు వదిలిపెట్టి పోయింది ఆ తరువాత ఆ పాప తండ్రి వెతుక్కుంటూ వస్తే వేరే హాస్టల్ కి తీసుకు వెళ్లారని చెప్పారు అది ఎక్కడ అని ఆరా తీస్తే మీరు తీసుకువెళ్లారని చెప్పారు అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights

అమ్మ ఒడి హాస్టల్ నుంచి నేను తీసుకువచ్చింది అమ్మాయి ఒక్కదాన్నే ఆ అమ్మాయి పేరు అరుంధతి అని సరస్వతి అంటుంది. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో మాకు చెప్తారా అని భాగమతి వాళ్ళ పిన్ని అడుగుతుంది.ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయింది మంచి భర్త అత్తమామలు కూతుర్ల చూసుకునే వాళ్ళు కోట్ల ఆస్తి అన్నీ ఉన్నా ఆనందంగా ఉండే లోపే ఆ భగవంతుడు ఆ అమ్మాయిని తీసుకువెళ్లిపోయాడు అని సరస్వతి అంటుంది. ఆ అమ్మాయి ఫోటో మాకు ఒకసారి ఇస్తారా అని వాళ్ళ పిన్ని అడుగుతుంది. మీరు ఆ అమ్మాయికి ఏమవుతారు అని సరస్వతి అడుగుతుంది,ఇంతలో సరస్వతికి ఫోను వస్తే మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు.

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights

ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు అని సరస్వతి అనుకుంటుంది. కట్ చేస్తే,అమరేంద్ర పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గరికి వచ్చేస్తాడు. పిల్లల్ని చూసిన రామ్మూర్తి పిల్లల దగ్గరికి పరిగెత్తికెళ్తాడు. అదిగో తాతయ్య మన దగ్గరికి వస్తున్నాడు అని అమృత అంటుంది. ఎవరు ఈయన ఒక్క రోజులో పిల్లలకి ఇంత దగ్గర అయ్యే అంత అనుబంధం ఏముంది అని అరుంధతి అనుకుంటుంది. మీకోసం ఎంత సేపటి నుంచి ఎదురుచూస్తున్నాను తెలుసా అని రామ్మూర్తి అంటాడు. డాడీ తాతయ్య అని చెప్పాను కదా ఈయనే అని వాళ్ళ నాన్నకు పరిచయం చేస్తుంది అమృత.

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights

పిల్లలు మీ గురించి చెప్పారు వాళ్లను బాగా చూసుకున్నందుకు మీకు థాంక్స్ అని అమరేంద్ర అంటాడు. నేనే పిల్లలకు థాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే నా ఆకలిని చూసి అంజు పాప నిన్ను అడగకుండానే నాకు అన్నం పెట్టింది అని రామ్మూర్తి అంటాడు. మెల్లగా రావాల్సింది అలా పరిగెత్తుకొచ్చేసరికి ఆయాస పడిపోతున్నారు చూడండి అని అమరేంద్ర అంటాడు. స్కూల్ టైం అవుతుంది పిల్లలు ఇంకా రావట్లేదు ఈ రోజు పిల్లల్ని చూస్తానా లేదా అనుకున్నాను ఈ లోపు వచ్చేసరికి ఆనందంతో పరిగెత్తుకొచ్చాను,పిల్లలు మీకోసం చాక్లెట్ తెచ్చాను తీసుకోండి అని రామ్మూర్తి అంటాడు. పిల్లలు ఆనందంతో చాక్లెట్ తీసుకొని తింటారు. రామ్మూర్తి దగ్గగానే అయ్యో పరిగెత్తుకొచ్చేసరికి చూశారా దగ్గు వస్తుంది మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని రావాల్సింది అని అరుంధతి అంటుంది. ఆ మాటలు విన్న రామ్మూర్తి అరుంధతి వైపు చూస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights

ఏంటి తాతయ్య ఎవరికోసం వెతుకుతున్నావు అని పిల్లలు అంటారు. ఏమీ లేదమ్మా ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూశాను అని రామ్మూర్తి అంటాడు. మీరు అలా దగ్గుతున్నారు ఈ జాబు మీకు పర్వాలేదా అని అమరేంద్ర అంటాడు. పర్వాలేదు బాబు నా ఆరోగ్యం కోసం నా కూతురు మీలాంటి మిలిటరీ వాళ్ళ చుట్టూ తిరిగింది కానీ లాభం లేకపోవడంతో నా కూతురు కష్టాలు పడుతుంది అందుకే నేను ఈ జాబ్ చేస్తున్నాను అని రామ్మూర్తి అంటాడు. బాబు స్కూల్ కి టైం అవుతుంది పిల్లలని తీసుకొని వెళ్తాను అని రామ్మూర్తి పిల్లలని తీసుకొని వెళ్ళిపోతాడు.పిల్లల్ని రామ్మూర్తి తీసుకు వెళ్తుంటే మా నాన్న ఉంటే ఇలాగే తీసుకు వెళ్లేవాడు కదా అని మనసులో అనుకొని సంతోషపడుతుంది అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 21 2023 Episode 86 Highlights

ఇంతలో అమరేంద్ర కారు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళేది ఏముంది ఇంకా నడుచుకుంటూ వెళ్లడమే అని అరుంధతి అనుకుంటుంది. కట్ చేస్తే,అంజు వాళ్ళ అమ్మ కోసం బాగా చదువుతుంది. అమ్మో అంజు పాప ఎలా చదువుతుందో ఏమో వెళ్లి చూద్దామని ఆ భాగమతి వెళ్తూ, అమ్మో ఆ కోపిష్టి మనిషి చూస్తే మళ్ళీ తిడతాడు అయినా ఆయన ఇంట్లో లేడు కదా స్కూల్ కి పిల్లల్ని తీసుకువెళ్లాడు అని భాగమతి అనుకుంటుంది.


Share

Related posts

Karthika Deepam: జ్వాలను చాలా చీప్ గా చూసిన నిరూపమ్.. శోభచేతిలో అక్కచెల్లెళ్ళ జీవితం నాశనం కానుందా..?

Ram

Brahmamudi: కావ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్వప్న వెనకున్నది రాహుల్ అని తెలిసిపోతుందా.. 

bharani jella

దీప గొంతు గుర్తుపట్టిన సౌర్య.. ఆనంద్ ను తీసుకుని రావడానికి రంగం సిద్ధం చేసిన మోనిత..!

Ram