Nindu Noorella Saavasam October 16th ఎపిసోడ్ 55: నీలు నువ్వు వెళ్లి అమ్మగారికి జ్యూస్ తీసుకురా అని అమరేంద్ర అంటాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దు అమరేంద్ర అని మనోహరి అంటుంది. అసలు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావ్ అమ్మ అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు ఇలాంటి పని చేసావంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు నీకేమైనా అయితే మీ ఫ్రెండ్ బాధపడదా అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. అవునే నీళ్లు కరెక్టుగా అదే టైం కు ను ఎలా చూసావు ఎవరో చెప్పినట్టు అని రాథోడ్ అంటాడు. ప్రాణాలకు తెగించి నేను ప్లాన్ వేస్తే వీళ్ళు చెడగొట్టేలా ఉన్నారే అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. బాబు గారు నాకేం తెలియదండి అని నీళ్లు అంటుంది. మీరు ఆగండి అసలు ఇలాంటి పని నువ్వు ఎందుకు చేసావ్ మనోహరి అరుంధతి కొంచెం తిరిగి నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావని నేను అనుకున్నాను కానీ ఈ పని చేసి నా దృష్టిలో చాలా తక్కువ అయిపోయావు అని అమరేంద్ర అంటాడు.

సారీ అమరేంద్ర అని మనోహరి అంటుంది. చూడమ్మా నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. బాధ ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఇలా చేసి ఉంటావని నాకు తెలుసమ్మా కానీ చెప్పుకుంటే కదా నీ కష్టమేంటో తెలిసేది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు నువ్వు ఇలా చేస్తే మీ ఫ్రెండ్ ఆత్మ శాంతిస్తుందా అసలు నువ్వు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసావో చెప్పమ్మా కారణం ఏంటి అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. నిన్న రాత్రి అమరేంద్ర నా దగ్గరికి వచ్చి అరుంధతి దశదిన కర్మ అయిపోయింది ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు ఎందుకలా అన్నాడు నేను వెళ్లి ఎక్కడ ఉండాలి ఎవరి కోసం బ్రతకాలి ఇప్పుడు నాకు ఆరు కూడా లేదు అని రాత్రంతా ఆలోచించాను ఇన్నాళ్లు మీరే నా కుటుంబం అనుకున్నాను ఆరు లేకపోయినా మీ అందరితో కలిసి ఉండొచ్చు ఆరు లేదని మరిచిపోవచ్చు అని అనుకున్నాను కానీ సడన్గా అమరేంద్ర అలా అనేసరికి ఏం చేయాలో తోచక నాకు ఇంకా ఎవరూ లేరే అని మనసుకు బాధ అనిపించి ఇలాంటి పని చేశాను ఆంటీ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను సారీ అని అంటుంది మనోహరి.

మనోహరి ఇంకెప్పుడూ ఎవరూ లేరని అనకు నీకు నేనున్నాను నీ జీవితం మా ఇంట్లో ఉంటే ఎక్కడ ఆగిపోతుందోనని అలా చెప్పాను అంతేకానీ నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది కలుగుతుందని కాదు సారీ అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న పిల్లలు ఆంటీ ఇన్నాళ్లు మమ్మల్ని సరిగ్గా చూసుకోక పోవడం వల్ల కావాలనే ఇలా చేస్తున్నావేమో మేమంటే నీకు ఇష్టం లేదేమో నచ్చిన ఫుడ్డు పెట్టట్లేదు స్కూల్ కి వెళితే తిడుతున్నావు అంజుకి జీరో మార్కులు వస్తే డాడీ దగ్గర ఇరికించి తిట్టించావు అని మేము అనుకున్నాము కానీ ఇవ్వాలే తెలిసింది మేము అంటే నీకు ఎంత ప్రేమ అని అమృత అంటుంది. ప్రేమని ఒకొక్కరు ఒక్కొక్కలా చూపెడతారు మీ అమ్మ ప్రేమ ఎక్కువై మీరు గారాబంగా పెరిగారు మీ నాన్నగారు ఏమో కోపంగా చూస్తాడు అలాగనే మీరు మీ నాన్నకి మీరంటే ఇష్టం లేదని అనుకుంటారా నాదైనా మీ నాన్నదైనా ఒకటే బాధ గారాబంతో మీరు ఎక్కడ పాడైపోతారు అని అలా ప్రవర్తించాను అంతమాత్రాన మీరు నా పిల్లలు కాకుండా పోతారా అని మనోహరి అంటుంది.

సారీ ఆంటీ ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయము అని అమృత అంటుంది.సారీ దేనికి అమ్మ నేనే మీకు చెప్పాలి ఈరోజు నా వల్లే మీకు స్కూల్ కి వెళ్లకుండా ఉండిపోయారు మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోండి అని మనోహరి అంటుంది. అవునా ఆంటీ మీరు ఉన్నారు కదా మమ్మల్ని చూసుకోవడానికి ఇక మిస్సమ్మని పంపించేయండి అని అంజు అంటుంది. అలాగే మీరు చెప్పారు కదా పంపించేద్దాం మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి అని మనోహరి అంటుంది. అమ్మగారు నన్ను క్షమించండి అని నీళ్ళు మనోహరి కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఏమైందనే అని మనోహరి అంటుంది. అమ్మగారు మీరు వేసిన ప్లాను బలే వర్కౌట్ అయిందమ్మ ప్రాణాలకు తెగించి ఇలా చేశారు ఇక మీరు ఈ కుటుంబాన్ని ఏలొచ్చు మీ దగ్గర కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటే నా రేంజి ఎటో వెళ్లిపోతుంది మీరు చాలా గొప్పోళ్ళు అమ్మగారు అని నీళ్లు అంటుంది. చావడానికి నేనేమన్నా పిచ్చిదాని అనుకుంటున్నావా ఈ దెబ్బతో ఇంట్లో శాశ్వతంగా ఉండి పోవచ్చు చూస్తూ ఉండవే అమరేంద్ర తో నా పెళ్ళికి ఆ మిస్సమ్మ తోనే బ్యాండ్ వాయిస్తాను అని మనోహరి అంటుంది.భగవంతుడా గుప్తా గారు పైకి వెళ్దాము వెళ్దాము మీరు ఇక్కడే ఉంటే మీ ఆత్మ గోశిస్తుంది అని మొత్తుకున్నా సరే నేను వినలేదు దీనికే కావచ్చు కానీ మనోహరి నేను నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు నా పిల్లని మాత్రం నీ నుండి కాపాడుకుంటాను అని అరుంధతి అనుకుంటుంది.

కట్ చేస్తే ఒరేయ్ భాగమతి హాస్టల్లో నుంచి కాళీ చేస్తున్నట్టు వేరే జాబు దొరికింది వెళ్ళిపోతున్నాను అన్నట్టు మనకు చెప్పలేదు దానికి ఫోన్ చేయరా ఎక్కడ ఉందో అని వాళ్ళ పిన్ని అంటుంది. అక్క నడవలేనా అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు ఒరేయ్ కొద్దిసేపటి తర్వాత బీర్ ఇప్పిస్తాను కానీ నువ్వు ముందు భాగమతికి ఫోన్ చేయరా అని వాళ్ళ అక్క అంటుంది. అక్క భాగమతి మన జీవితంలో లేకపోతే గుడిమెట్ల దగ్గర అడుక్కోవాలిసిందే ఎలాగైనా అదెక్కడ ఉందో తెలుసుకోవాలి అక్క అని వాళ్ళ తమ్ముడు భాగమతికి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ భాగమతి ఎత్తదు అక్క అది ఫోన్ కూడా ఎత్తట్లేదు అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు. అది ఫోన్ ఎత్తట్లేదు హాస్టల్ నుంచి కాలి చేసి వెళ్ళిపోయింది అది కొంపదీసి వాళ్ళ నాన్నని వదిలించుకుందామని వెళ్ళిపోయిందా లేదంటే వాళ్ళ నాన్న మీద ప్రేమ తగ్గిపోయిందా ఆ రోగిష్టి వాడిని నాకంట గట్టి తను తప్పించుకుందా రేయ్ నువ్వు ఇంటికి రారా మనం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని వాళ్ళ అక్క అంటుంది. సరే అక్క అని వాళ్ళు వెళుతూ ఉండగా భాగమతి అమరేంద్ర వాళ్ళ ఇంట్లో కనపడుతుంది ఇదేమిటి ఇంత పెద్ద ఇంట్లో ఉంది ఇది కలా నిజమా అని వాళ్ళ తమ్ముడు కళ్ళు తుడుచుకొని మరీ చూస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది