Nindu Noorella Saavasam October 26 Episode 64: అమ్మగారు వాళ్ళిద్దరూ బలేగా ఎదురుపడ్డారే అని నీలా అంటుంది. ఆ మాటతో మనోహరికి కోపం వచ్చి నీలా చెంప చెడేలు మనిపిస్తుంది. వాళ్ళిద్దరూ డ్యాష్ ఇచ్చుకుంటే నన్నెందుకు అమ్మ కొట్టారు అని నీలా అంటుంది. అంతా నీ కుడి కన్ను అదరడం వల్లే ఇంకా పిక్నిక్ లో ఎన్ని జరుగుతాయో ఏమేమి చూడాలి ముందు దాన్ని తీసి పక్కన పడేయ్ అని మనోహరి అంటుంది. కట్ చేస్తే పిల్లలందరూ కిందికి వచ్చి కార్ ఎక్కుదామని చూసేసరికి మనోహరి ముందు సీట్లో కూర్చొని ఉంటుంది. ఆంటీ మీరు వెనక కూర్చోండి నేను డాడీ పక్కన కూర్చుంటాను అని అంజు అంటుంది. తను వచ్చి కూర్చుంది కదమ్మా నువ్వు వెనకాల కూర్చో అని అమరేంద్ర అంటాడు. అదేం కుదరదు డాడీ నేను ముందు సీట్లోనే కూర్చుంటాను అని అంజు అంటుంది.

అంజు ఆంటీ ఫీల్ అవుతుంది ఎందుకే మనం నలుగురు వెనకాల కూర్చుందాం పద అని అమృత అంటుంది. అంజు పాపా నేను ముందు సీట్ల కూర్చున్నాను కదా నువ్వు ముందు సీట్లో కూర్చోవాలంటే వేరే కార్లో ఎక్కి కూర్చో అని మనోహరి అంటుంది. కుదరదు నేను డాడీ పక్కనే కూర్చోవాలి అని అంజు బెట్టు చేస్తుంది. తను ఎంత చెప్పినా వినదమ్మ నువ్వు వచ్చి ఈ కార్లో కూర్చో భాగమతి ముందు సీట్లో కూర్చొని అంజు పాపని తన వొల్లో కూర్చోబెట్టుకుంటుంది అని రాథోడ్ అంటాడు. అది కాదు అంకుల్ అని మనోహరి అంటూ ఉండగా. తను చిన్నపిల్ల కదా అమ్మ ఎంత చెప్పినా వినదు నువ్వే అడ్జస్ట్ అవ్వు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. అమ్మో ఇప్పుడు సార్ పక్కన భాగమతిని కూర్చో పెడుతున్నారు ఇక నా చెంప పగిలిపోయినట్టే అని నీలా అనుకుంటుంది.

కారు దిగిన మనోహరి నీలా దగ్గరికి వెళ్లి చంప పగలగొడుతుంది. దేనికమ్మ నన్ను కొట్టారు ముందు సీట్లో ఆవిడ కూర్చుంటే నన్ను కొడతారేంటి అని నీలా అంటుంది. భాగమతి అంజుని తన వొళ్ళో కూర్చోబెట్టుకొని ముందు సీట్లో కూర్చుంటుంది. అప్పుడు అమరేంద్ర సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు. భాగమతి సీట్ బెల్ట్ పెట్టుకోగానే అమరేంద్ర కార్ స్టార్ట్ చేస్తాడు. కారుకు ఎదురుగా నిలబడి అరుంధతి టాటా చెప్తుంది అది చూసిన భాగమతి తనకు కూడా బాయ్ అని చెయ్యి ఊపుతుంది అక్కడ ఎవరూ లేరు కదా ఎవరికీ టాటా చెప్తున్నావు అని అమరేంద్ర అంటాడు. పక్కింటి ఆవిడకి చెప్తున్నాను అని భాగమతి అంటుంది. పక్కింటి ఆంటీ అయితే మాకు చెప్పాలి కానీ నీకెందుకు చెప్పింది అని అమృత అంటుంది. అవును కదా అని భాగమతి ఆలోచిస్తూ ఉంటుంది. కారు వెళ్లిపోగానే హమ్మయ్య వీళ్ళు పిక్నిక్ వెళ్లారు మరి నేను ఎలా వెళ్లాలి అని అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలో గుప్తా గారు వచ్చి ఎక్కడికో వెళ్తాను అన్నారు వెళ్ళలేదు ఏంటి అని అంటాడు. వెళ్దాం అనుకున్నాను గుప్తా గారు కాని అక్కడికి వెళ్తే భాగమతి నన్ను గుర్తు పడుతుంది కదా అని అరుంధతి అంటుంది. నువ్వు అక్కడికి పోయి ఆనందముతో ఆటపాటలలో మునిగి తేలుతుండగా నేను నా అంగులికమును తస్కరించవలె అని ఆలోచించి బాలిక నిన్ను నేను అక్కడికి తీసుకు వెళ్ళుటకు ప్రయత్నించెదను అని అంటాడు గుప్తా. అవునా అయితే నా పిల్లల సంతోషాన్ని చూడొచ్చు అని అరుంధతి సంతోష పడిపోతుంది. కట్ చేస్తే అక్క భాగమతి వాళ్లతో పిక్నిక్ వెళ్ళింది నువ్వు ఇక్కడేమో కూరగాయలు కట్ చేస్తున్నావ్ మరి నా పరిస్థితి ఏంటి అని వాళ్ళ తమ్ముడు అంటాడు.

విషయం అంత దూరం వచ్చిందా అయితే నువ్వు వాళ్లు ఎక్కడికి పిక్నిక్ వెళ్లారు అది తెలుసుకొని అక్కడికి వెళ్లి దానితో రెండు మూడు సార్లు మాట్లాడురా అప్పుడు విషయం వాళ్లకు అర్థమై తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొడతారు అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. అక్క నీ ఆలోచన సూపర్ అక్క ఇప్పుడే బయలుదేరుతాను అని వాళ్ళ తమ్ముడు అంటాడు.ఏంటే మీ తమ్ముడు నీ బయలుదేరు అంటున్నావ్ అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. ఏమీ లేదండి తిని ఇంట్లో కూర్చుంటే ఎలా రా పొట్ట గడవడం ఏదైనా పనికి వెళ్ళు అని అంటున్నాను అని వాళ్ళ పిన్ని అంటుంది. ఇన్నాళ్లకైనా మంచి మాట చెప్పావు మీ తమ్ముడికి అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. అక్క నువ్వు డబ్బులు అక్క నేను వెళ్ళిపోతాను అని వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు.ఏమే ఇంట్లో కూర్చుంటే పొద్దుపోవట్లేదు ఏదైనా వాచ్మెన్ పనిచేస్తే బాగుంటుంది అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. నీ పని నువ్వు చేసుకోవడం చేతకాదు కానీ డ్యూటీ చేస్తావా వెళ్లి పడుకో అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. కట్ చేస్తే అందరూ పిక్నిక్ కి వెళ్తారు.

రేయ్ అమర్ ఈ ఒక్కరోజైనా పిల్లలకి ఆంక్షలు పెట్టకుండా హ్యాపీగా ఆడుకోనివ్వరా అని వాళ్ళ నాన్న అంటాడు. అలాగే నాన్న అని రాథోడ్ని పిలిచి రాథోడ్ పిల్లల్ని ఈరోజు అంతా నువ్వే ఆడించు అని అంటాడు అమరేంద్ర. డాడీ పిక్నిక్ కు వచ్చింది మేము ఎంజాయ్ చేయడానికి కానీ మాకు కావాల్సింది తోడు కాదు డాడీ ధైర్యం నువ్వు మా పక్కన ఉంటే చాలు డాడీ అని అంజు అంటుంది. నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా పనిష్మెంట్లు ఇచ్చిన సరే నువ్వు మాతో ఉంటే చాలు డాడీ అని అమృత అంటుంది. సరే పదండి ఈ రోజంతా మీతోనే ఉండి ఆడుకుంటాను అని అంజుని ఎత్తుకొని పిల్లల్ని తీసుకొని అమరేంద్ర వెళ్ళిపోతాడు. అమర్ తో పాటు నేను కూడా వెళ్లాలి అని మనోహరీ అనుకుంటుంది.ఆంటీ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వాళ్లకు దాహం వేస్తే మళ్లీ ఇక్కడికి రావాలి కదా అందుకే వాటర్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అంటుంది మనోహరి.

అంతలా వాటర్ కావాలంటే ఈ మిస్సమ్మ వెళ్తుందిలే అమ్మ నువ్వు ఎందుకు మొన్ననే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చావు రెస్ట్ తీసుకో అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. సరే ఆంటీ అని నీలాని తీసుకొని వెళుతూ ఈ ముసలి వాళ్లు నన్ను ఇలా తగులుకున్నారే అని అంటుంది మనోహరి. ఆ సంగతి అయితే నాకు తెలియదు కానీ అమ్మగారు నా కుడి కన్ను ఇంకా కొట్టుకుంటుంది ఏం జరుగుతుందో ఏమో అని నీలా అంటుంది. ముందు ఆ కుడి కన్ను పీకి పక్కన పడేసేయ్ అని వెళ్ళిపోతుంది మనోహరి.కట్ చేస్తే అరుంధతి గుప్తా గారు కూడా పిక్నిక్ కి వస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది